English | Telugu

అక్ష‌రం రాయాలంటే వ‌ణుకు పుట్టాలే

బిగ్‌బాస్ హౌస్ నుంచి 12వ వారం యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా బ‌య‌టికి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న అత‌ని ఫ్యాన్స్ తో పాటు ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురిచేసింది. ర‌వి ఎలిమినేట్ కావ‌డం ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. దీనిపై ర‌వి ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు దిగ‌గా.. సోష‌ల్ మీడియాలో ర‌వి ఎలిమినేష‌న్ పై అనుమానాలున్నాయంటూ పెద్ద ర‌చ్చే జ‌రిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ర‌వి ఎలిమ‌నేష‌న్ పై అనుమానాలున్నాయ‌ని, అత‌న్ని కావాల‌నే తొక్కేశార‌ని మండిప‌డ్డారు.

Also Read:సిరి - ష‌న్నుల హ‌గ్గుల యుద్ధం అన్ స్టాప‌బుల్‌

ఇదిలా వుంటే ర‌వి హౌస్ లో వున్న స‌మ‌యంలో యాంటీ ఫ్యాన్స్ అత‌న్ని దారుణంగా ట్రోల్ చేశారు. అంతే కాకుండా అత‌ని కుటుంబ స‌భ్యుల‌ని, చివ‌రికి అత‌ని పాప‌ని కూడా అస‌భ్య ప‌ద‌జాలంతో ట్రోల్ చేయ‌డం ర‌వికి మ‌న‌స్తాపాన్ని, ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. దీంతో ఆగ్ర‌హించిన ర‌వి త‌నని, త‌న వారిని అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేసిన వారిపై యుద్ధం ప్ర‌క‌టించాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారిని విడిచి పెట్టే ప్ర‌స‌క్తి లేదంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇన్ స్టా, ఎఫ్ బీ, ట్విట్ట‌ర్‌.. యూట్యూబ్ వేదిక‌గా త‌న‌ని, త‌న వారిని వేధించిన వారిపై కంప్లైంట్ రైజ్ చేశాడు ర‌వి. త‌ను కంప్లైంట్ ఇస్తున్న ఫొటోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. త‌ప్పు మాట మాట్లాడాలి.. టైప్ చేయాలంటే భ‌యం పుట్టాల‌ని.. త‌ప్పుడు రాత‌లు రాయాలనుకునే వారి వెన్నులో ఇప్ప‌టి నుంచే వ‌ణుకు పుట్టాలి` అంటూ యాంక‌ర్ ర‌వి త‌న పోస్ట్ లో షేర్ చేశాడు. ఇప్పుడిది సెట్టింట వైర‌ల్ గా మారింది.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.