English | Telugu

'హౌస్‌లో ఉన్న అందరికంటే నేనే తోపు' అంటున్న గీతు!

బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకి ఊహాగానాలు మారిపోతున్నాయి. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి సరికొత్త టాస్క్ లతో సరదా సరదాగానూ, ఉత్కంఠభరితంగానూ సాగుతోంది. ఇలా సాగడానికి కారణం షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అవ్వడం. గతవారం డబుల్ ఎలిమినేషన్ కారణం ఐతే.. ఈ వారం నామినేషన్లో గీతు, రేవంత్, శ్రీహాన్, చంటి, అదిత్య, వాసంతి, ఇనయా, ఆరోహీ ఉండటం వల్ల ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది.

'టాస్క్ మొదలవ్వగానే మీరందరూ నేను ఓడిపోవాలని ఆడారు అంట కదా.. తెలిసింది' అని రేవంత్ ని అడిగింది గీతు. దానికి రేవంత్ 'నేను ఒక్కడినే అలా అనలేదు, నా తోటి ఉన్నవాళ్ళు అందరూ అన్నారు' అని సమాధానమిచ్చాడు. 'మీరందరూ నేను గెలవకూడదు అనుకుంటున్నారంటే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని, అయితే మీ అందరికంటే నేనే తోపు అన్నమాట' అని రేవంత్‌తోగొప్పగా చెప్పుకొచ్చింది గీతు. తర్వాత 'టాస్క్ తో మంచి కనెక్షన్స్ పెరిగాయి' అని శ్రీహాన్ తో అంది.

"గీతు, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నారు" అని బిగ్ బాస్ చెప్పాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి విజేతలుగా ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్ ఉన్నారు. 'వీరు ముగ్గురు సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్వీకరిస్తారో రేపు జరిగే కెప్టెన్సీ టాస్క్ లో తెలుస్తుంది' అని బిగ్ బాస్ ముగించేసాడు. ఇలా పద్దెనిమిదవ రోజు ఉత్కంఠభ‌రితంగా కొనసాగింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.