English | Telugu

నన్ను పెళ్లి చేసుకుంటావా?.. ప‌విత్ర‌కు ప్ర‌పోజ్ చేసిన సంతోష్‌!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ వారం సోసోగా సాగింది. ఐతే ఇందులో ఫైనల్ ట్విస్ట్ గా కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు. ఆది తను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయికి రాసిన లవ్ లెటర్ ని ఫన్నీగా చదివి వినిపించాడు. ఇమ్మానుయేల్ తను 8th క్లాస్ చదివేటప్పుడు తన ఫస్ట్ లవ్ కొనిపెట్టిన జామెట్రీ బాక్స్ ని చూపించి దాని హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఇక పంచ్ ప్రసాద్ తన ఫస్ట్ లవ్ ఐన సునీతకు కొనిచ్చిన రింగ్ ని చూపించాడు. నిజ జీవితంలో సునీతనే పెళ్లి చేసుకున్నాడు ప్రసాద్.

ఇక ఈ జోడి పెయిర్ లో పరదేశి జోడి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్యను స్టేజి మీదకు తీసుకొచ్చి ప్రపోజ్ చేసాడు ప‌ర‌దేశి. అలాగే తన గుండెల మీద పొడిపించుకున్న ఆమె పచ్చబొట్టు పేరు చూపించి తన ప్రేమను యాక్సెప్ట్‌ చేయమంటూ అడిగేసరికి ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది.

అలాగే పవిత్రకి కూడా యాంకర్ రష్మీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సంతోష్ అనే వ్యక్తిని స్టేజి మీదకు పిలిచారు. అతను వచ్చి తన ప్రేమనంతా గొప్ప కవిత్వంగా మార్చేసి చెప్పేసి పవిత్ర ఫోటోతో ఒక లామినేషన్ చేసి ఇచ్చేసాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని రింగ్ ఇచ్చి మరీ అడిగేసరికి పవిత్ర షాకైపోయింది.

"అసలు అతనెవరో నాకు తెలియాలి. నన్నెప్పటినుంచి ప్రేమిస్తున్నావ్? అసలు నేనంటే నీకు ఎందుకంత ఇష్టం" అంటూ ప్రశ్నించే సరికి స్టేజి మీద అందరూ స్ట‌న్న‌య్యారు. "నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాం, చేసాం" అని రష్మీ చెప్పేసరికి అదంతా నిజమో, అబ‌ద్ధ‌మో అర్థం కాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.