English | Telugu
11 నెలల కేలండర్ ఎక్కడైనా ఉంటుందా?
Updated : Jul 12, 2022
'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రెడీ అవుతూ ఆడియన్స్ ని పలకరిస్తూ రేటింగ్ లో కూడా దుమ్ము దులిపేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ కేలండర్ లా అంటూ 2022 కేలండర్ ని చూపిస్తూ ఒక్కో నెలని ఒక్కొక్కరికి డేడికేట్ చేస్తూ అట్లుంటది మనతోని అన్న రేంజ్ లో కనిపిస్తోంది.
ఇక విషయంలోకి వస్తే జనవరిలోకీర్తికేశవ్ భట్, ఆది, ఫిబ్రవరిలో రష్మీ, మార్చ్ నెలకు కావ్యశ్రీ, నిఖిల్ జంట, ఏప్రిల్ నెలకు రష్మీ, నందిత శ్వేతాతో మరో వ్యక్తి ఉన్న జంట, మే నెలకు శివజ్యోతి, గంగూలీ జంట, జూన్ నెలకు ఆటో రాంప్రసాద్ జంట, జులై నెలకు ఆసియా, నూకరాజు, ఆగష్టు నెలకు హైపర్ ఆది, నాటీ నరేష్ తో మరో జంట, సెప్టెంబర్ నెలకు శాంతిస్వరూప్, బులెట్ భాస్కర్ నాన్న, మరో జోడి, ఇంకా నవంబర్ నెలకుఫైమా, ప్రవీణ్ జంట కనిపించగా ఇక అదే నవంబర్ నెలలో ప్రగతి మరో లేడీతో కనిపించింది, ఫైనల్ గా డిసెంబర్ నెలలో అంబటి అర్జున్, సుహాసిని జోడి కనిపించబోతోంది. అంతా బానే ఉంది కానీ 12 నెలల్లో ఒక నెలను మాత్రం కనిపించకుండా సెన్సార్ చేశారు. అక్టోబర్ నెల కేలండర్ లో కనిపించలేదు.
ఈ నెలను మాత్రం ఎవరికీ ఎందుకు డేడికేట్ చేయలేదో తెలీలేదు. అలాగే ఈ నెలను కనబడకుండా చేయడం వెనక ఉద్దేశం కూడా అంతుబట్టడం లేదు. లేదంటే అక్టోబర్ బదులు నవంబర్ అని పొరపాటున రెండు సార్లు వచ్చేసిందా. ఇక బాక్గ్రౌండ్ వాయిస్ లో "కనబడాల్సింది ఒకే ఒక్క పేరు .. అట్లుంటది మనతోని" అంటూ వినిపిస్తుంది. మరి ఈ అక్టోబర్ నెలను సుధీర్ కి కానీ డేడికేట్ చేశారా!.. కానీ ప్రెజంట్ ఈ సీరియల్ నుంచి పక్కకు వెళ్ళాడు కాబట్టి ఆ నెలను కనిపించకుండా చేశారా లేదా ఇంకా ఎవరైనా స్పెషల్ జోడితో ఎపిసోడ్ లో సీక్రెట్ గా రిలీజ్ చేస్తారా.. అబ్బో..ఇలాంటి ఎన్నో అనుమానాలను రైజ్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఆ ఒక్క నెల వెనక ఉన్న మిస్టరీ ఏమిటో తెలియాలంటే 17 వరకు ఆగాల్సిందే.