English | Telugu

హరితేజ మాస్ ఎంట్రీ.. ఇక కన్నడ బ్యాచ్ కి దబిడిదిబిడే !

హరితేజ బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎంట్రీ ఇచ్చి మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. మళ్ళీ సీజన్-8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మంచి డాన్స్ పర్ఫామెన్స్ తో హరితేజ మొదటి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున స్టేజి మీదకి పిలవగానే ఫుల్ జోష్ తో వచ్చింది. ఇక తనకి సర్ ప్రైజ్ వీడియోగా తన తోటి కంటెస్టెంట్ అయిన నవదీప్ మాట్లాడిన వీడియోని ప్లే చేశాడు నాగ్ మామ. నువ్వు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా ఆడు అంటూ హరితేజని మోటివేట్ చేశాడు నవదీప్.

ఆ తర్వాత హరితేజ వెళ్ళబోతుంటే నీకు ఇంకో సర్ ప్రైజ్ అంటు నాగార్జున ఆపాడు. తన కూతురు భూమిని స్టేజ్ మీదకి పిలుస్తాడు నాగ్ మామ. తనని చూడగానే హరితేజ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత హరితేజ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. అందరిని వెళ్లి పరిచయం చేసుకుంటుంది. అంతే కాకుండా పాత కంటెస్టెంట్ లకి విష్ణుప్రియ, నిఖిల్ లు.. మరొక వైపు టేస్టీ తేజ, హరితేజలు కలిసి టాస్క్ ఆడుతారు. ఇందులో హరితేజ , టేస్తీ తేజ విన్ అయి ఇరవై లక్షల మనీ గెలుచుకొని ప్రైజ్ మనీకీ ఆడ్ చేస్తారు.

ఆ తర్వాత వచ్చిన వాళ్లందరితో హరితేజ పాజిటివ్ గా మాట్లాడుతూ.. మంచి కామెడీ టైమింగ్ తో పంచ్ లు వేస్తుంది. ఇక నామినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే.. పృథ్వీ , యష్మీలని హరితేజ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. హరితేజ బయట నుండి వాళ్ళ గేమ్ చూసి వచ్చి.. ఎవరు ఎలా ఆడుతున్నారోనని తెలుసుకొని వచ్చింది కాబట్టి నామినేషన్ పాయింట్స్ స్ట్రాంగ్ గా పెట్టి వాళ్లకు గట్టి పోటీ ఇస్తుందనిపిస్తుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.