English | Telugu

Guppedantha Manasu : శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1159 లో.....అసలు ఆ మనుగాడు ఏం చేసినా భయపడట్లేదు.. వాడు అర్థం అవ్వడం లేదు.. ఏదోదో వాగేసాడు.. ఆగస్ట్ లో ఏదో ఒకటి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడని శైలేంద్ర అనగానే.. అంటే వాడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అనుకుంటున్నావా.. తన తండ్రి ఎవరో తెలిసిన మరుక్షణం చంపేస్తాను అన్నవాడు ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడని ఆలోచిస్తున్నావా అని దేవయాని అంటుంది. ఎవరికైనా తండ్రి మీద ప్రేమ తప్ప కోపం ఉండదు.. అందరూ తండ్రి ఎవరు అనడం వల్ల వాడికి తండ్రి పై కోపం పెరిగింది కానీ మహేంద్ర అంటే ఇష్టం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాడని దేవయాని అంటుంది. నువ్వే వాడిని టైమ్ దొరికినప్పుడల్లా ఇర్రిటేట్ చేయమని దేవయాని చెప్తుంది. దాంతో వాడు పెద్ద ముదరు అని శైలేంద్ర అంటాడు.

మరొకవైపు అసలు నేను మను తండ్రి ఏంటి అసలు? ఎలా జరిగింది? నేను ఎప్పుడు అనుపమని మంచి స్నేహితురాలిలాగే చూసానని మహేంద్ర బాధపడతాడు. వసుధర అంత గట్టిగా చెప్తుందంటే అది నిజమే అయి ఉంటుందని మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మనుకి మహేంద్ర ఫోన్ చేస్తాడు. మను మహేంద్ర కాల్ చూసి కోపంగా ఉంటాడు.. లిఫ్ట్ చెయ్యడు. ప్లీజ్ మను ఫోన్ లిఫ్ట్ చెయ్ నీతో మాట్లాడాలని మహేంద్ర మెసేజ్ చేస్తాడు. అయినా మను ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత అనుపమకి కూడా ఫోన్ చేస్తాడు.. తను లిఫ్ట్ చెయ్యదు. మహేంద్రకి రిషి కాల్ చేసి ఎక్కడున్నారు.. ఇంట్లో నుండి బయటకి రావద్దని చెప్తాడు. అసలు మీరేం చేస్తున్నారు నాకు అర్థం అవడం లేదు.. ఇంత పెద్ద విషయమని రిషితో వసుధార అంటుండగా.. అప్పుడే శైలంద్ర వచ్చి ఎంత పెద్ద విషయం అంటాడు. నీకు సెన్స్ లేదా ఎందుకు పర్మిషన్ లేకుండా వస్తావని శైలేంద్రపై వసుధార కోప్పడుతుంది. ఏంటి మా అన్నయ్య అంటే రెస్పెక్ట్ లేదా అలా తిడుతున్నావ్.. నువ్వు ఇప్పుడే మా అన్నయ్యకి సారి చెప్పాలని రిషి అనగానే మీరు ఎందుకు చెప్పమని అంటున్నారో నాకు తెలుసంటు శైలేంద్రకి వసుధార సారీ చెప్తుంది.

అ తర్వాత రిషిని శైలేంద్ర పక్కకు తీసుకొని వస్తాడు. ఏంటి ఏదో పెద్ద విషయం అంటుంది.. ఏంటి రంగా అని శైలేంద్ర అడుగుతాడు. మను గురించి, మను ఎవరని రిషి అడుగుతాడు. మా బాబాయ్ దగ్గరకి కోపంగా మను ఏమైనా వచ్చాడా అని అడుగుతాడు. లేదని రిషి చెప్తాడు. మీరు ఎండీ పదవి కోసం చాలా తప్పులు చేశారంట కదా అని వసుధర మేడమ్ అంటున్నారని రిషి అంటాడు. అదేం లేదు అవన్నీ నీకనవసరమని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.