English | Telugu

గాయత్రీ దేవి ఆత్మ చెప్పిన అద్దంలో ఏముంది?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి త‌న భ‌ర్త త‌ల్లి మ‌ర్ద‌ర్ మిస్ట‌రీని ఎలా ఛేదించింది?.. స‌వ‌తి త‌ల్లి కుట్ర నుంచి త‌న భ‌ర్తని ఎలా కాపాడుకుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇందులో అషికా గోపాల్‌, చందూ గౌడ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు న‌టించారు.

త‌న తండ్రి పుండ‌రీ నాథం రాసిన వీలు నామాలో వున్న ర‌హ‌స్యం తెలియాలంటే పున్న‌మినాటి చంద్రుని వెలుగులో నాన్న గీసిన చిత్రాన్ని అద్దంలో పెట్టి చూడాల‌ని న‌య‌నితో గాయ‌త్రీ దేవి ఆత్మ‌ చెబుతుంది. అయితే ఆ అద్దం తిలొత్త‌మ ఇంట్లో వుండ‌టంతో విశాల్‌, న‌య‌ని కొంత మందిని తీసుకుని ఇన్ క‌మ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అంటూ రైడ్ కి వ‌చ్చామంటూ తిలోత్త‌మ ఇంట్లో హ‌డావిడి చేస్తారు. ఇల్లంతా జ‌ల్లెడ ప‌డ‌తారు. చివ‌రికి హాసిని స‌హాయంతో పెద్ద అద్దం వెన‌కాల గాయ‌త్రీ దేవి చెప్పిన‌ చిన్న అద్దం ల‌భిస్తుంది. ఇదే స‌మ‌యంలో వ‌ల్ల‌భ‌, క‌సి అక్క‌డికి వస్తారు.

వారిని డైవ‌ర్ట్ చేసి విశాల్‌, న‌య‌ని.. గాయ‌త్రిదేవి చెప్పిన అద్దాన్ని చాక‌చ‌క్యంగా ఇంటికి తెచ్చుకుంటారు. ఇదే స‌మ‌యంలో గాయ‌త్రీ దేవి ఆత్మ మ‌ళ్లీ వ‌స్తుంది.. స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంద‌ని నేను చెప్పింది చేయ‌మ‌ని చెబుఏతుంది. దీంతో పౌర్ణ‌మి రోజు ఉద‌యాన్నే పూజ తో కార్య‌క్ర‌మం మొద‌లు పెడుతుంది న‌య‌ని. ఇదిలా వుంటే ఇన్ క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్స్ రైడ్ పేరుతో మారు వేశాల్లో వ‌చ్చింది విశాల్‌, న‌య‌ని అని క‌సి అనుమానం వ్య‌క్తం చేస్తుంది. అనుమానం కాద‌ని అదే నిజ‌మ‌ని చెప్ప‌డంతో తిలోత్త‌మ షాక్ కు గుర‌వుతుంది. ఇంత‌కీ వాళ్లు ప‌ట్టుకెళ్లిన అద్దంలో ఏముంద‌ని వ‌ల్ల‌భ అంటాడు. దీంతో తిలోత్త‌మ‌కు చిర్రెత్తుకొచ్చి వ‌ల్ల‌భ‌ని చీవాట్లు పెడుతుంది. అంతా క‌లిసి న‌య‌ని ఏం చేయ‌బోతోందో తెలుసుకోవాల‌ని వాళ్లు వుంటున్న కాల‌నీకి బ‌య‌లు దేర‌తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.