English | Telugu

Bigg Boss 9: ప్రేమించిన వాడు హింసించేవాడు.. ఫ్లోరా సైని ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-9 నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందులోకి సెకెండ్ కంటెస్టెంట్ గా వెళ్లిన ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని గురించి తక్కువ మందికే తెలుసు. 'ప్రేమకోసం' సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసింది ఫ్లోరా సైని. నరసింహానాయుడు సినిమాలోని లక్స్ పాప సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన '143' మూవీలోనూ నటించింది. (Flora Saini)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఈ భామ.. హీరోయిన్ అవకాశాలు రాకపోకవడంతో బాలివుడ్ కి వెళ్లింది. అక్కడ భిన్నమైన పాత్రలు చేసిన ఫ్లోరా సైని.. తమిళ, కన్నడ సినిమాలల్లో‌నూ నటించింది. తన ఇరవై ఏళ్ళ వయసులో ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది‌ ఫ్లోరా సైని. అయితే అతను తనని మానసికంగా, శారీరకంగా హింసించేవాడని, సినిమాలు చేయకూడదని బలవంతం చేశాడని, తన శరీరంపై గాయలతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుగా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక సంవత్సరం పాటు ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడని, ఒకరోజు తన పొట్టపై తన్నడంతో ఆ నొప్పిని భరించలేకపోయానని, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టిందంటూ ఎమోషనల్ అయింది ఫ్లోరా సైని.

బిగ్ బాస్ సీజన్-9 లో అడుగుపెట్టిన ఫ్లోరా సైనికి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.