English | Telugu
ఆది చొక్కా చిరిగింది... కట్టప్ప కామం పేలింది!
Updated : Aug 15, 2021
ప్రతివారం బుల్లితెర వీక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో ‘జబర్దస్త్’, ‘ఎక్ర్ట్సా జబర్దస్త్’. వచ్చే వారం మరింత వినోదంతో వస్తున్నట్టు తాజా ప్రోమోలు చెబుతున్నాయి. ‘జబర్దస్త్’లోని టీమ్ లీడర్ ‘హైపర్’ ఆదిని ‘సుడిగాలి’ సుధీర్ టీమ్ ‘ఎక్ర్ట్సా జబర్దస్త్’కు తీసుకొచ్చింది. సుధీర్, అతని టీమ్ సభ్యులైన రామ్‌ప్రసాద్, గెటప్ శీను, ఆది మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. ‘రైజింగ్’ రాజు ఈమధ్య కనిపించడం లేదు. ఈమధ్య ఆది స్కిట్స్‌లో తరచూ రామ్‌ప్రసాద్ కనిపిస్తున్నాడు. మరి, రాజుగారు ఏమయ్యారో? అతను లేకపోయినా కామెడీకి ఏమాత్రం లోటు లేకుండా ఆది స్కిట్స్‌ను నడిపిస్తున్నాడు. దాంతో చాలామందికి తెలియడం లేదు... రాజుగారు మిస్సింగ్ అని. ఇక, వచ్చే వారం ‘ఎక్ర్ట్సా జబర్దస్త్’కు వస్తే...
‘బుల్లెట్’ భాస్కర్ టీమ్ ‘బాహుబలి’ థీమ్ తీసుకుని స్కిట్ చేసింది. అందులో కట్టప్ప క్యారెక్టర్ సుధీర్ చేశాడు. సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస అయితే, స్కిట్‌లో కామంతో కటకటలాడే క్యారెక్టర్‌గా చూపించాడు. గతంలో ఇటువంటి క్యారెక్టర్లు సుధీర్ చేశాడు. మళ్ళీ సుధీర్ కామం పేలింది. సుధీర్ టీమ్ స్కేటింగ్ షూస్ వేసుకుని స్కిట్ చేసింది. అందులో ఒకరి మీద మరొకరు పడగా, ఆది చొక్కా చిరిగింది. ‘ఇది ఏమిరా ఇది?’ అనుకుంటూ స్టేజి మీద నుంచి ఆది వెళ్లిపోయాడు.
‘ఎక్ర్ట్సా జబర్దస్త్’ లేటెస్ట్ ప్రోమోలో కొసమెరుపు ఏంటంటే... జడ్జ్ సీటులో అనసూయ కనిపించడం. మామూలుగా రోజా, మనో ఉంటారు కదా! వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కాకుండా సోలోగా అక్కడక్కడా అనసూయను చూపించారు.