English | Telugu

హ‌గ్గు కోసం ఆది గోల‌.. పోటీకి దిగిన ర‌వికృష్ణ!

ఈటీలో ప్ర‌సారం అవుతున్న కిరాక్ డ్యాన్సింగ్ షో `ఢీ 14`. మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు స‌మ‌ర్పిస్తున్న ఈ డ్యాన్స్ షో గ‌త కొన్నేళ్లుగా టాప్ లో నిలుస్తూ టాప్ రేటింగ్ తో ట్రెండ్ అవుతూ వ‌స్తోంది. ప్ర‌దీప్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో టీమ్ లీడ‌ర్లుగా హైప‌ర్ ఆది, ర‌వికృష్ణ, న‌వ్యా స్వామిలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌డ్జెస్ గా శ్ర‌ద్దా దాస్‌, నందితా శ్వేతా, గ‌ణేష్ మాస్ట‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. డ్యాన్సింగ్ ఐకాన్ క‌ల‌ర్స్ స్పెష‌ల్ పేరుతో క‌ల‌ర్స్ థీమ్ డాన్స్ ఎపిసోడ్ ని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేశారు.

ఆగ‌స్టు 10న ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ప్ర‌తీ డ్యాన్స్ జోడీ ఓ క‌ల‌ర్ థీమ్ లో డ్యాన్స్ చేయ‌డం ఆ ఎనిసోడ్ ప్ర‌త్యేక‌త.వైట్ థీమ్ లో ఓ జోడీ.. పింక్ క‌ల‌ర్ థీమ్ లో ఓ జోడీ.. డ్యాన్స్ అద‌ర‌గొట్టేశారు. ఇదే సంద‌ర్భంగా శ్ర‌ద్ధా దాస్ కు ఓ కంటెస్టెంట్ ముద్దు పెట్ట‌డంతో ఆది ఫీల‌య్యాడు. అది గ‌మ‌నించిన శ్ర‌ద్దా స్టేజ్ పైకి ఆదిని పిలిచింది. వెంట‌నే వెళ్లిపోయిన ఆది వెంట ఓ అమ్మాయి కూడా వెళ్లిపోయింది.

ఏం జ‌రుగుతోంది ఇక్క‌డ అని హైప‌ర్ ఆదిని అడిగితే `ఢీ 14` తెలియ‌దా` అని పంచ్ వేశాడు. దాంతో అంతా న‌వ్వేశారు. ఆ త‌రువాత మీ మ‌ధ్య‌లో ఏం జ‌ర‌గుతోంద‌ని మ‌ళ్లీ అడిగింది. `చిన్న డీల్ జ‌రుగుతోంది అయిపోగానే పిలుస్తా `ని ఆది అనే స‌రికి మై న‌హీ జావుంగీ అని స‌ద‌రు అమ్మాయి కౌంట‌ర్ ఇచ్చింది. అయితే శ్రద్దా నేను క‌రూంగీ` అంటూ మ‌రో పంజ్ వేశాడు ఆది. ఆ త‌రువాత శ్ర‌ద్దా ద‌గ్గ‌రికి వెళ్లిపోవ‌డంతో కిస్ కాదు కానీ హ‌గ్ మాత్రం ఇస్తాన‌ని శ్ర‌ద్దా ఓపెన్ గా చెప్పేసింది.. దాంతో ఏదో ఒక‌టిరా అంటూ ఆదిముందుకు వెళ్లాడు.. అది గ‌మ‌నించిన ర‌వికృష్ణ అక్క‌డి వ‌చ్చేసి ఆదిని స్టేజ్ పై నుంచి కిందికి లాగేశాడు. దీంతో హైప‌ర్ ఆది ఈ రోజు శావాల్లేస్తాయి చెబుతున్నారు అంటూ వార్నింగ్ ఇవ్వ‌డం.. న‌వ్యాస్వామి ఎంట్రీ ఇచ్చి ఏంటిది అని ర‌వికృష్ణ‌ని అడ‌గ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.