English | Telugu

మా పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోడానికి మీరెవరన్న రాజ్.. కన్నీళ్ళు పెట్టుకున్న ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-96లో.. కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. నీకు ఇంకా తక్కువ టైం ఉంది.. తొందరగా నీ తప్పేం లేదని నిరూపించుకోమని అంటాడు. నాకు తెలుసు.. నేను నిరూపించుకోకపోతే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారని తెలుసని కావ్య అంటాడు. ఇదంతా పైనుండి ధాన్యలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత కావ్య కళ్యాణ్ దగ్గరికి వచ్చి తన ఫోన్ తీసుకొని స్వప్నకి కాల్ చేస్తుంది.

తను కాల్ లిఫ్డ్ చేయదు. దాంతో అప్పుకి కాల్ చేస్తుంది కావ్య. ఏంటక్కా అని అప్పు అనగా.‌. స్వప్న అక్కకి ఫోన్ ఇవ్వమని అంటుంది. అప్పు స్వప్న గదిలోకి వెళ్ళి కావ్య అక్క ఫోన్ చేసింది, నీతో మాట్లాడలంటుంది అనగా.‌.‌ నేను మాట్లాడనని స్వప్న అంటుంది. ఆ తర్వాత స్వప్నకి అప్పు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. దాంతో కావ్యతో ఫోన్ మాట్లాడుతుంది స్వప్న. కావ్య చెప్పేదేమీ వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తుంది స్వప్న.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి నిజం తెలుసుకోవాలని రాజ్ గదిలోకి వస్తుంది. ‌మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలెందుకు కావ్యని పంపించాలనుకుంటున్నావని రాజ్ ని అడుగుతుంది ధాన్యలక్ష్మి. మీకేం తెలియదని రాజ్ అనగా.. చెప్పు రాజ్ తెలుసుకుంటాను.. కావ్య చిన్న చిన్న తప్పులేమైనా చేస్తే నేను సర్ది చెప్తానని ధాన్యలక్ష్మి అనగా.. అది మా పర్సనల్ విషయం మధ్యలో మీరేవరు మాట్లాడటానికని రాజ్ అనగానే.. ధాన్యలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఇక అడగను సారీ రాజ్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి.

ఆ తర్వాత అపర్ణకి జ్వరం వచ్చిందని‌ రాజ్ వాళ్ళ నాన్న తెలుసుకుంటాడు. ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి అతను ఆఫీస్ కి వెళ్తాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా పూజ ఎవరు చేస్తారని అనుకుంటారు. అప్పుడు ఇందిరాదేవి కావ్యని పూజ చేయమంటుంది. నాకో నియమం ఉంది కదా.. పూజ గదిలోకి వెళ్ళొద్దని అత్తయ్య చెప్పిందని కావ్య అనగా.. నేను అపర్ణకి చెప్తాను లే.. నువ్వు పూజ చేయమని ఇందిరాదేవి అంటుంది. దానికి సరేనని కావ్య పూజ చేస్తుంది.

కావ్య ఆపిల్, పాలు తీసుకొని అపర్ణ దగ్గరికి వెళ్తుంది. మేడమ్.. పాలు తాగండి.. ఆపిల్ కట్ చేసి ఇవ్వాలా అని కావ్య అడుగుతుంది. ఈ వంకతో నాకు దగ్గరవ్వాలని చూస్తున్నావా అని అపర్ణ అంటుంది. సరే మేడమ్.. నా మీద కోపం ఫుడ్ మీద చూపించకండి.. నేను ఉంటే మీరు ఇబ్బంది పడుతున్నారు.. నేను వెళ్ళాక తినండని అపర్ణకి చెప్పేసి కావ్య అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.