English | Telugu
డాన్స్ ఇండియా డాన్స్ కంటెస్టెంట్స్ తో డాన్స్ ప్రోమో
Updated : Aug 16, 2022
జీ తెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ స్పెషల్ డాన్స్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. "డ్యాన్స్ లో తమ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్న కంటెస్టెంట్స్" అనే టాగ్ లైన్ తో జీ తెలుగు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇంకా ఈ ప్రోమో సాంగ్ కూడా ఫుల్ జోష్ తో నిండిపోయింది. ఈ డాన్స్ ప్రోమో యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వెంటనే ఎన్నో వ్యూస్ ని అందుకుంది. ఈ ప్రోమోలో సినీ యాక్టర్ సంగీత, కమెడియన్ రోహిణి, డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్, హోస్ట్ అకుల్ బాలాజీ తో కలిసి డాన్స్ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ నేమ్స్ కూడా ఈ ప్రోమోలో చూపించారు. డేవిడ్ అండ్ డేనియల్, ప్రజ్వల్ అండ్ దక్షిత, వినోద్ అండ్ గౌసియా, సోహానా అండ్ రక్షిత్, మైఖేల్ బాబు అండ్ కుమార్, వందన అండ్ పూజ, శరత్ అండ్ ఆయుషి, చెర్రీ అండ్ భూమిక, దివ్య అండ్ జల్ప గజ్జర్, అబ్బు అండ్ అక్షద.. వీళ్లందరితో కలిసి ఒక ఇన్స్పిరేషనల్ ప్రోమో సాంగ్ షూట్ చేసి కంటెస్టెంట్ నేమ్స్ ని కూడా ఆ ప్రోమోలో ప్రెజంట్ చేసింది డాన్స్ ఇండియా డాన్స్. ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి మరి కొంత మంది టాలెంటెడ్, యంగ్, డైనమిక్ కొరియోగ్రాఫర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ షో ఆగష్టు 21 న రాత్రి 9 గంటలకు స్టార్ట్ కాబోతోంది.