English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లో ఆట ఆడాలి అంటే ఫేక్‌గా ఉంటే చాలు!

చలాకి చంటి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు. ఇక వచ్చాక బీబీ కేఫ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "చలాకి చంటి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమైపోయాడు" అని ఆడియన్స్ అనుకుంటున్నారని యాంకర్ అనేసరికి "ఇది నువ్వు ఇస్తున్న కామెంటా,జనాలు ఇచ్చారని చెప్తున్నావా?.. ఎవరు అన్నారో నా ముందుకు తీసుకురా, నేను సమాధానం చెప్తా" అంటూ ఫైర్ అయ్యాడు.

"హౌస్ లో ఉన్నవాళ్లు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరిని ఇరికించడానికైనా రెడీగా ఉన్నారు.. మీరు గేమ్ ఆడలేదు అని చెప్పకుండా మీ గేమ్ ఆపడం బిగ్ బాస్ తప్పు అంటారా?" అని అడిగేసరికి "ఎలాగైనా అనుకో" అంటూ ఘాటుగా చెప్పాడు చంటి. "బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడాలి అంటే ఫేక్ గా ఉంటే చాలు. అలా ఉన్న వాళ్ళే గేమ్ ఆడగలరు అని నాకు అనిపించింది. నువ్ కూడా ఫేక్ గానే ఆడావుగా" అని యాంకర్ వైపు బాణం సంధించాడు చంటి.

"మీకు ఇగో ఎక్కువ కాబట్టి ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు" అని యాంకర్ అనేసరికి "ఇగో ఎప్పుడొస్తుంది.. కెలికినప్పుడు వస్తుంది. నా ఇగోని కెలికిందెవరు" అంటూ గలాటా గీతూ ఇమేజ్ చూపించాడు. "నేను ఇలాగే ఉంటా, ఇలాగే గేమ్ ఆడతా, ఎవరినానైనా మోసం చేస్తా అనే బుద్ది ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు" అన్నాడు చంటి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.