English | Telugu

వినాయక చవితి రోజున మటన్, చికెన్ జోకులేంటమ్మా

క్యాష్ ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న ఒక గేమ్ షో. ఇందులో ప్రశ్నలు అడుగుతారు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే డబ్బులిస్తారు కూడా. ఇక ఈ వారం షోకి "స్వాతిముత్యం" మూవీ టీం వచ్చేసింది. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, పమ్మి సాయి, దివ్య శ్రీపాద, లక్ష్మణ్ కే.కృష్ణ వచ్చేసారు. ఇక ఈ షోలో టీమ్ తో కొన్ని గేమ్స్ ఆడించేశాక సుమ కండక్టర్ వేషం వేస్తుంది. ఒక పాసెంజర్ కుర్రాడికి వాంతులయ్యేసరికి "ఎన్నో నెలమ్మా" అని అడిగి ఫన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఒక హాస్పిటల్ పెట్టి పేషెంట్స్ ని పిలవమంటూ వర్ష కి సుమ పని చెప్తుంది. "వర్ష రండి , రండి అని పిలిచేసరికి రండి, రండి ఈగలు తోలుకుందాం అని పిలుస్తున్నావేంటి" అని అడుగుతూ కౌంటర్ వేస్తుంది సుమ.

తర్వాత వినాయక లడ్డు వేలం పాట పెడుతుంది సుమ. తక్కువ చందాలు ఇచ్చిన వాళ్ళను తిడుతూ సరదాగా జోక్స్ వేస్తుంది. అదయ్యాక మాకు ఒక కాస్ట్లీ స్టాండప్ కమెడియన్ వర్ష వచ్చారు అంటూ సుమ చప్పట్లు కొడుతూ ఇన్వైట్ చేస్తుంది. " అప్పుడే చప్పట్లు కొడుతున్నారేంటి " అని గణేష్ అడిగేసరికి "తర్వాత జోక్ పేలుతుందో లేదో ముందే చప్పట్లు కొట్టడం బెటర్ కదా" అని అంటుంది సుమ. ఇంతలో వర్ష "కోడికి ఒక ఫాదర్ ఉంటారు అతన్ని ఏమని పిలుస్తారు" అంటూ ఒక జోక్ ని ప్రశ్నగా అడుగుతుంది. "నేను ఇన్ని రోజులు తెలియకుండానే తినేశానే" అంటూ ఫీల్ అవుతుంది సుమ. "మటన్ చికెన్ కి ఏమని చెప్పింది" అంటూ ఇంకో జోక్ చెప్పేసరికి" "అన్ని ఇలాంటి జోకులేనా ఈ వినాయక చవితి రోజున అవసరమా" అంటుంది సుమ. ఆ డైలాగ్ కి వర్ష నోరు మూసేసుకుంటుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.