English | Telugu

ఆలియాకి సారె పెట్టిన సుమ!

'బ్రహ్మాస్త్ర' టీం మూవీ ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌లవుతోంది. ఇప్పుడు ఈ టీం సుమ ఆడించే క్యాష్ షోకి వచ్చేసారు. స్టేజి మీదకు ఎంట్రీ ఇస్తూనే రణబీర్ "బాగున్నారా, బాగున్నారా?" అంటూ పలకరించాడు. ఇంతలో సుమ వచ్చి "రణబీర్ కంటే ఆలియాకి తెలుగు బాగా తెలుసు" అనేసరికి "కొంచెం కొంచెం తెలుసు" అంది ఆలియా. "నీకు నా ముద్దులు, నీకు నా ముద్దులు" అంటూ ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇచ్చింది రణబీర్ కి ఆలియా.

"నువ్ మాట్లాడడానికి ఛాన్స్ రావట్లేదు అనుకుంటున్నావు కదా" అని సుమ అడిగేసరికి, "మాట్లాడకుండా ఉండడమే నాకు చాలా హ్యాపీ" అన్నాడు ర‌ణ‌బీర్‌. "ఎందుకంటే నా భార్య పెద్ద చాటర్ బాక్స్ కదా, అందుకే నేను సైలెంట్ గా ఉంటాను" అన్నాడు. తర్వాత రణబీర్ కి, ఆలియాకి వాళ్ళ ఫొటోస్ చూపించి అందులో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేయమని టాస్క్ ఇచ్చింది సుమ‌. ఇద్దరూ బాగా చేశారు.

తర్వాత "ఎస్ ఎస్ రాజమౌళి వెపన్ షాప్" అనే ఒకదాన్ని ఓపెన్ చేసింది సుమ.అందులో రాజమౌళి మూవీస్ లో వాడిన ఎన్నో అస్త్రాలు ఉంటాయి. అవి ఏ మూవీలో వాడారో వాటి పేర్లు చెప్తూ కాసేపు ఎంటర్టైన్ చేశారు. తర్వాత తెలుగు వారి సంప్రదాయం ప్రకారం మన ఇళ్లకు వచ్చే గర్భిణీ స్త్రీలకూ ఎలా సారె పెడతామో అలాగే ఆలియాకి బొట్టు పెట్టి చీర, గాజులు, పళ్ళు, పూలు ఇచ్చింది సుమ. ఇలా క్యాష్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.