English | Telugu

Brahmamudi : కావ్య డిజైన్స్ లో ఏం ఉందంటే.. భర్తకి తెలియకుండా అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -526 లో......కావ్య ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతుంటే.. కనకం టిఫిన్, లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. టిఫిన్ చేసే టైమ్ లేదు కానీ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తానంటూ కావ్య వెళ్తుంటే.. కృష్ణమూర్తి ఎదరుపడి ఛార్జ్ డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. ఉన్నాయని కావ్య అనగానే చూపించమని అంటాడు. డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నావని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. కావ్యకి డబ్బులు ఇచ్చి కృష్ణమూర్తి అటోలో వెళ్ళమని చెప్తాడు. కావ్య వెళ్ళిపోయాక మీరు కావ్య జాబ్ చెయ్యడానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ దాని కాపురం బాగుండాలంటూ మాట్లాడుతుంది.

మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే అపర్ణ, ఇందిరాదేవిలు కంపెనీకి మంచి పేరు తీసుకొని రావాలని చెప్తారు. అదంతా చూస్తున్న రుద్రాణి అనామికకి ఫోన్ చేసి రాజ్ మళ్ళీ ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్తుంది. వెళ్లనివ్వు.. నా ప్లాన్ లో నేనున్నా.. ఇక కావ్య డిజైన్స్ ని అడ్డం పెట్టుకొని స్వరాజ్ కంపెనీని తొక్కేస్తాను. ఇక భార్య వర్సెస్ భర్త అని అనామిక అంటుంది. మరొకవైపు రాజ్, కావ్యలు అనుకోకుండా ఇద్దరు ఒకే గుడికి వెళ్తారు. ఇద్దరు ఒకేసారి గంట కొడుతుంటే.. నువ్వా అంటూ రాజ్ అంటాడు. ఇక ఇద్దరి మధ్య ఎప్పటిలాగా వార్ మొదలవుతుంది. ఆ తర్వాత పూజారి అర్చన చేస్తుంటే నాకు పెళ్లి కాలేదని రాజ్ అనగానే.. అయ్యో ఇంకా పెళ్లి కాలేదా ఏదైనా లోపం ఉండి ఉంటుంది హాస్పిటల్ లో చూపించుకోమని పూజారి అంటాడు. దాంతో కావ్య నవ్వుతుంది. నాకు పెళ్లి అయింది నా మొగుడు తాగి వచ్చి టార్చర్ చేస్తున్నాడంటూ కావ్య కావాలనే అంటుంది. ఆ తర్వాత రాజ్ తొక్క పై అడుగేసి పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. రాజ్ తిక్కగా మాట్లాడుతుంటే అతడిని చేతుల్లో నుండి వదిలేస్తుంది కావ్య.. దాంతో రాజ్ కింద పడిపోతాడు.

ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి అందరు వర్క్ చేయకుండా ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో రాజ్ అందరిపై కోప్పడతాడు. తరువాయి భాగంలో కావ్య డిజైన్స్ మాకు వేస్తుందని కావ్యకి తెలియొద్దని అనామిక మీడియటర్ కి చెప్తుంది. అతను కావ్యతో పెద్ద కంపెనీతో టై అప్ అయ్యాం.. మీరు మంచి డిజైన్స్ వేయండి అంటాడు. దానికి కావ్య సరే అంటుంది. సామంత్ రాజ్ తో ఛాలెంజ్ చేస్తాడు. ఇక మా కంపెనీనే నెంబర్ వన్ లో ఉంటుందని అంటాడు. ఆ తర్వాత రాజ్ ఒకవైపు.. కావ్య ఒకవైపు డిజైన్స్ వేస్తుంటారు. కావ్య డిజైన్స్ వేస్తుంటే నీ మనసులో ఉంది కాగితంపై వేస్తున్నావా అని కావ్యతో కనకం అంటుంది. కావ్య డిజైన్స్ కాకుండా రాజ్, కావ్యల ఫోటోని వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.