English | Telugu

Ramu Rathod Remuneration: రాము రాథోడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ గా అడుగుపెట్టిన రాము రాథోడ్ కి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ప్రతీ వారం అతను నామినేషన్లో ఉండగా అతనికి అత్యధిక ఓటింగ్ పడింది. అందులోను అతనికి ఎవరితో అంతగా గొడవలు లేవు. అయితే కంటెంట్ కూడా ఏం ఇవ్వకపోవడంతో అతనికి కాస్త ఓటింగ్ తగ్గింది.

రాము రాథోడ్ హౌస్ లో మొదటి నుండి భరణితో క్లోజ్ గా ఉండేవాడు. ఆ తర్వాత గౌరవ్ తో మాట్లాడేవాడు. అయితే గతవారం గౌరవ్ ని నామినేట్ చేశాడు రాము రాథోడ్. దాంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి‌. ఇక హౌస్ లో ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్నానంటూ రాము బయటకు వచ్చేముందు చెప్పాడు. రాము రాథోడ్ లో నిరుత్సాహం పెరగడం.. టాస్క్‌లలో మధ్యలోనే గివప్ చెప్పడం, నామినేషన్ల సమయంలో కూడా చాలా నీరసంగా వ్యవహరించడం వల్ల ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇమేజ్ స్టార్ట్ అయ్యింది. అయితే రాము ఇలా ఉండటానికి కారణం లేకపోలేదు. గత కొన్నిరోజులుగా రాము తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల , ఒంటరితనం, ఇంటి జ్ఞాపకాలతో హోమ్ సిక్ అయ్యాడు. ఈ కారణాలతోనే రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.

రాము రాథోడ్ హౌస్ లో తొమ్మిది వారాలున్నాడు. అతను ఉన్నన్ని రోజులకు గాను ప్రతీవారం సుమారు రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద రాముకి పద్దెనిమిది లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు సమాచారం. రాము సెల్ఫ్ ఎలిమినేషన్ ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు అతనికి సపోర్ట్ గా ఉంటున్నారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.