English | Telugu

అదిరిపోతున్న బిగ్ బాస్ హౌస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4 న సాయంత్రం 6 గంటలకు మొదలుకావడానికి సిద్దమయ్యింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో బిగ్ బాస్ హౌస్ ని లోపల లొకేషన్ ని చూపించారు. ఈ హౌస్ లోకి మెరీనా-రోహిత్ సాహ్ని జోడి, జబర్దస్త్ ఫేమ్ ఫైమా, తన్మయ్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెరీనా-రోహిత్ సాహ్ని జోడి పై ప్రోమో షూట్ జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే హోస్ట్ నాగార్జున శుక్ర, శని వారాల్లో షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఇక ఈ సీజన్లో సామాన్యులని కూడా హౌస్ లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. మొదటి ఫైవ్ సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ అదిరిపోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అ అంటే అమలాపురం అనే ఐటం సాంగ్‌తో పాపులరైన అభినయ శ్రీ ఈసారి హౌస్‌లో స్పెష‌ల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తర్వాత జబర్దస్త్‌ నుంచి చలాకీ చంటి, నటుడు శ్రీహాన్‌, సింగర్‌ రేవంత్‌, నటుడు బాలాదిత్య, గలాటా గీతూ వంటి వాళ్ళు ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్, వారి పెర్ఫార్మెన్సెస్ తో కొన్ని విజువల్స్ ని ప్రోమోలో చూపించారు. ఆదివారం చాలా గ్రాండ్ గా ఈ షో స్టార్ట్ కాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.