English | Telugu

Bigg boss 9 telugu: పవర్ కార్డ్స్ కోసం వేట.. సుమన్ శెట్టికి సంజన అన్యాయం!

బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం నుండి కెప్టెన్సీ టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా పవర్ కార్డ్స్ ని కంటెస్టెంట్స్ పొందాలి వారికి బెనిఫిట్స్ ఉంటాయంటూ బిగ్ బాస్ చెప్పాడు.

పవర్ కార్డ్స్ పొందడం కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ హంగ్రీ హిప్పో. గార్డెన్ ఏరియాలో బాగా ఆకలితో ఉన్న ఒక హిప్పో ఉంది.. దానికి సమయానుసారం ఆకలి వేసినప్పుడల్లా సౌండ్ చేస్తూ ఉంటుంది.. ఆ సమయంలో హౌస్‌లో ఉన్న వేరు వేరు ప్రదేశాల్లో ఆ హిప్పో ఆకలి తీర్చడానికి కావాల్సిన బాల్స్ దొరుకుతాయి.. హిప్పో సౌండ్ చేసినప్పుడల్లా పోటీదారులు హౌస్‌లో వేరు వేరు ఏరియాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న బాల్స్‌‌ని వెతికి వాటిని తీసుకొచ్చి హిప్పో నోటిలో వేసి ఆహారంగా తినిపించాలి.. ఈ ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ టీమ్ సభ్యులైతే హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేసి దాని ఆకలి తీరుస్తారో ఆ టీమ్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతలు అవుతారు.. వారికి నచ్చిన ఒక పవర్ కార్డ్‌ని పొందుతారు. ఈ ఛాలెంజ్‌లో పోటీదారులు తాము తీసుకున్న బాల్‌ని విసరడానికి వీల్లేదు.. తీసుకున్న బాల్స్‌ని కేవలం మీ చేతులతోనే మీ ఇతర టీమ్ సభ్యులకి పాస్ చేయాల్సి ఉంటుంది.. హిప్పో సౌండ్ చేసినప్పుడల్లా కేవలం ఒక బాల్ మాత్రమే లభిస్తుంది.. పోటీదారులు బాల్ తీసుకొని ఆరెంజ్ లైన్ దాటిని తర్వాత ఆ బాల్స్‌ని ఎవరూ తాకడానికి వీల్లేదు.. ఈ ఛాలెంజ్‌కి భరణి మీరు సంచాలకులాంటూ బిగ్‌బాస్ చెప్పాడు. బ్లూ టీమ్ (తనూజ, రీతూ, హరీష్), ఎల్లో టీమ్ (సంజన, రాము, సుమన్ శెట్టి), రెడ్ టీమ్ (ఇమ్మూ, కళ్యాణ్, ఫ్లోరా) లు ఈ ఛాలెంజ్‌లో బరిలోకి దిగాయి. గ్రీన్ టీమ్ రేసు నుంచి కిక్ ఔట్ అవ్వడంతో తప్పుకుంది.

అయితే ఈ టాస్క్ లో ఎల్లో టీమ్ లో ఉన్న సంజన వారికి సపోర్ట్ చేయకుండా రెడ్ టీమ్ కి సపోర్ట్ చేసింది. దాంతో సుమన్ శెట్టి ఎందుకు మేడమ్ అలా అని అడిగాడు. దానికి సంజన చెప్పిన సమాధానం విని సుమన్ శెట్టికి ఏం చేయాలో అర్థం కాలేదు. మన టీమ్ కంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారని, మనం ఎలాగు గెలవలేం కదా అని అంది. ఒకే కానీ మన టీమ్ కూడా గెలవాలి కదా.. అందరు మన వాళ్ళే కానీ ఈ గేమ్ వరకు మనం ఎల్లో టీమ్.. మనం గెలవాలి మేడమ్ అంటు సంజనకి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ తను అసలు వినలేదు. సుమన్ శెట్టి టాస్క్ లో బాగా ఆడినా ఫలితం లేకుండా పోయింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.