English | Telugu

తండ్రి కాబోతున్న సామ్రాట్

సామ్రాట్ అంటే గ‌తంలో ఎక్కువ‌మందికి తెలీదు కానీ, 'పంచాక్షరి' మూవీలో అనుష్క జోడీగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేయ‌డంతో మ‌రింత మందికి ద‌గ్గ‌ర‌య్యాడు. సామ్రాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ యాక్ట‌ర్‌ తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పేశాడు. తొందరలోనే తాను నాన్నను కాబోతున్నానని చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. "మా చిన్నారి రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం" అనే కాప్షన్ పెట్టి, బేబీ బంప్ ఉన్న‌ వైఫ్ శ్రీలిఖితతో క‌లిసున్న‌ ఫోటో షేర్ చేశాడు.

ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు నెటిజన్స్ విషెస్ కూడా చెప్పేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సామ్రాట్ మ్యారేజ్ లైఫ్ విషయం పై కొన్ని కాంట్ర‌వర్సీస్ నడిచాయి. అప్పట్లో మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం అనే విషయం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. రెండేళ్ల క్రితం శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు సామ్రాట్. టాలీవుడ్ లో 'పంచాక్షరి', 'అహ నా పెళ్ళంట', 'బావ' వంటి మూవీస్ లో యాక్ట్ చేశాడు. సామ్రాట్ తండ్రి కాబోతున్నాడని తెలిసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా కంగ్రాట్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక సామ్రాట్ కూడా తనకు విషెస్ చెప్పిన అందరికి థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.