English | Telugu

'బిగ్ బాస్' ఆరోహి కన్నీటి గతం.. రెమ్యూనరేషన్ కూడా తక్కువేనట!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్లో మీడియా నుండి ఒక కంటెస్టెంట్ ని తీసుకోవడం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సారి ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ గా చేస్తొన్న ఆరోహి రావ్ హౌస్ లోకి అడుపెట్టింది.

ఆరోహి రావ్ అసలు పేరు అంజలి. ఈమె వరంగల్ లో జన్మించింది. ఈమె చిన్నప్పుడే తల్లి చనిపోతే, తండ్రి వేరే పెళ్లి చేసుకొని, పిల్లలని వదిలి వెళ్లి పోయాడు. తనకి ఒక సోదరుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. ఒకానొక టైంలో వీళ్ళకి సరిగ్గా తినడానికి కూడా తిండి దొరికేది కాదట. ఆరోహి గవర్నమెంట్ స్కూల్ లో చదివింది. ఒక ప్రైవేట్‌ కాలేజీలో M.B.A పూర్తి చేసింది. అయితే తనకు చిన్నప్పటి నుండి యాంకరింగ్ అంటే ఆసక్తి ఉండేదంట. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి యాంకర్ గా ప్రయత్నం మొదలు పెట్టింది. ఒక హాస్టల్ లో ఉండేది. తను ఎప్పుడు కష్టాలను ఇంటిపేరుగా, కన్నీళ్లను ముద్దుపేరుగా చెప్పుకుంటూ ఉండేది. తనకు తన చుట్టు ఉన్న వాళ్ళలో 'మేము ఉన్నాం అనే వాళ్ళ కంటే, మాకేంటి అనే వాళ్ళే ఎక్కువ' అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

కొన్ని రోజులకి ఒక చిన్న ఛానెల్ లో అవకాశం రాగా, డబ్బులు సరిపోక కొన్ని రోజులకి అందులో నుండి బయటకి వచ్చేసి, మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ అడిషన్స్ కి వెళ్లగా, అక్కడ ఆరోహి చలాకీతనం, తెలంగాణ యాసలో మాట్లాడం చూసి సెలక్ట్ చేసారట. ఇస్మార్ట్ న్యూస్ లో ఆరోహి సెటైర్ లు, ఇంకా యాస జనాలకు నచ్చడంతో ఆరోహి పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి పంతొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆరోహి, హౌస్ లో మొదటి వారం నుండి అన్నింటిలోను చురుకుగా పాల్గొంది. అయితే హౌస్ లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ లిస్ట్ లో, గీతు తరువాత ఆరోహి అనే చెప్పేస్తారు ఈ షో చూసే ప్రేక్షకులు. కాగా హౌస్ లో అందరితో గొడవలు పెట్టుకోవడం ఒకటి తనకి మైనస్ అని చెప్పుకోవాలి. నామినేషన్ లో నుండి చాలా సార్లు సేవ్ అయినా, కానీ అయిదవ వారం ఓటింగ్ లో చివరి స్థానం ఉండడంతో బయటకొచ్చేసింది. తను బయటికి రావడానికి ఒక రకంగా సూర్య అనే చెప్పుకోవాలి. హౌస్ లో జరిగే అటలో పర్ఫామెన్స్ ఏమీ ఇవ్వకపోగా, సూర్యతో చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం ప్రేక్షకులకు చికాకు తెప్పించింది అని అనడంలో ఆశ్చర్యం లేదు. వీరిద్దరిని చూసి హౌస్ లో లవర్స్ అని చాలా మందే అన్నారు. నాగార్జున ఒక సారి అడుగగా మేము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది. తను బయటకొచ్చాక హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "టాప్-5 లో ఉంటా అనుకున్నా, కానీ అయిదవ వారమే బయటికి రావడం చాలా బాధగా ఉంది" అంటు చెప్పుకొచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యూనరేషన్ గురించి మీరు రోజుకి నలభై వేల వరకు తీసుకున్నారంట కదా అని అడుగగా, "అలాంటిదేమీ లేదు. నేను అంత ఏమీ తీసుకోలేదు" అని మాట దాటేసింది. అయితే తను రోజుకి పదిహేను నుండి ఇరవై వేల వరకు తీసుకుందని బయట వినిపిస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.