English | Telugu

Ticket to Finale: సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్.. షాక్ లో కన్నడ బ్యాచ్!

 

బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కన్నడ బ్యాచ్ గ్రూపిజానికి చెక్ వేస్తూ మొన్న రోహిణి, నిన్న అవినాష్ గుణపాఠం చెప్పారు. వీళ్లు కమెడియన్స్.. ఏదో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికిరారు. ముఖ్యంగా ఫిజికల్‌ గేమ్‌లలో అస్సలు ఆడలేరు. ఏదో అదృష్టం కలిసి వచ్చి హౌస్‌లో ఉంటున్నారు తప్పితే.. టోటల్‌గా వీళ్లు జీరో.. ఇవీ అవినాష్, రోహిణి, తేజాలను ఉద్దేశించి కన్నడ అండ్ కో బ్యాచ్‌లోని పృథ్వీ అన్నాడు. అయితే జీరో అన్న నోటితోనే హీరో అనిపించుకుని.. పృథ్వీ అహంకారాన్ని తన విజయంతోనే సమాధి చేసింది రోహిణి. బిగ్ బాస్ హౌస్‌కి చివరి మెగా చీఫ్ కావడమే కాకుండా.. వరుసగా రెండు టాస్క్‌లలో గెలిచి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్ నిలిచాడు. నబీల్, పృథ్వీ, ప్రేరణ లాంటి గేమర్స్ మీద అవినాష్ గెలిచి కామెడీన్ కాదు గేమర్ అని నిరూపించుకున్నాడు.  మానస్, ప్రియాంక జైన్ హౌస్ లోకి వచ్చి గేమ్ ఆడించాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో ఫస్ట్ డే ఆడిన వారు కాకుండా మిగిలినవారిలో పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్ లతో మొదటి గేమ్ ' సుడోకు నెంబర్' గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ గెలిచాడు. ఆ తర్వాత సెకెండ్ టాస్క్ '   బోర్డ్ క్రికెట్ '. ఇందులో కూడా అవినాష్ గెలిచాడు. మొదట నబీల్ ఆడగా.. నాలుగు సిక్స్ లతో ఇరవై నాలుగు పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రేరణ, పృథ్వీ ముప్పై పరుగులు చేశాడు. ఇక వారి తర్వాత వచ్చిన అవినాష్ నలభై మూడు పరుగులు చేసి విజయం సాధించాడు.

అవినాష్ ఈ గెలుపుతో కన్నడ బ్యాచ్ కి షాకిచ్చాడు. వారితో పాటే ఉన్న నబీల్ కి ఇది ఒక గుణపాఠంలా తీసుకొని ఇండివిడ్యువల్ గా ఆడతాడా లేదా చూడాలి. ఎంటర్‌టైనర్ అని అనుకున్న అవినాష్ హౌస్ లో ఉన్న మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ కి తన గెలుపుతో సమాధానమిచ్చాడు.