English | Telugu

అమ్మమ్మ గెటప్ లో అషురెడ్డి.. ఇదే మోస్ట్ బ్యూటిఫుల్ ఫొటో షూట్ అంట!

ఇన్ స్టాగ్రామ్ లో కొందరు బుల్లితెర సెలెబ్రిటీలు చేసే ఫోటో షూట్స్ కొన్ని వైరల్ అవుతుంటాయి. మరీ బోల్డ్ గా ఉండేలా కొంతమంది చేసేవి ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారి లిస్ట్ లో అషు రెడ్డి, అనసూయ, ఇనయా, అరియానా, సుభశ్రీ రాయగురు ఉన్నారు. వీరు రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలతో వైరల్ అవుతుంటారు. (Ashu Reddy)

అషు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ గా హీట్ పుట్టించే ఫొటోస్ పెట్టి సందడి చేస్తూ ఉంటుంది. అషు తరచుగా కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. ఐతే ఎన్ని ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా సమయం తీసుకుని మరీ సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ కి టచ్ లో ఉండడం మాత్రం అస్సలు మర్చిపోదు. అషురెడ్డి తాజాగా అమ్మమ్మ గెటప్ వేసుకొని కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇదే మోస్ట్ బ్యూటిఫుల్ ఫోటోషూట్ అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది అషు. సేమ్ అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే రెడీ అయ్యి నెటిజన్లకి షాకిచ్చింది. వైట్ హెయిర్ అప్పట్లో‌ ముసలివాళ్ళు ఎలా ఉంటారో అలాగే రెడీ అయి దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన వారు తెగ కామెంట్లు చేస్తున్నారు.

సడన్ గా మంచు లక్ష్మీ అనుకున్నా కదారా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇన్ని రోజులు ఎడిట్ చేసి ఫోటోలు పెట్టి, ఇప్పుడేంటి ఎడిట్ చేయకుండా పెట్టేసావా అని పటాస్ హరి కామెంట్ చేశాడు. ముసలిదే కానీ మహానుభావురాలు అని ఒకరు కామెంట్ చేశారు. ఒరిజనల్ పిక్ ఇప్పుడు పెట్టావా అంటు మరొకరు కామెంట్ చేశారు. మంచు లక్ష్మి తో చాలామంది పోల్చారు. బామ్మ గెటప్ లో ఉన్న అషు పోస్ట్ కి కామెంట్ల వర్షం కురుస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.