English | Telugu

అనుని కిడ్నాప్ చేసిన ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. జీ తెలుగులో గ‌త కొంత కాలంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ట్విస్ట్ ల‌తో సాగ‌బోతోంది . ఈ రోజు ఎపిసోడ్‌హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. యాక్సిడెంట్ నుంచి అను త‌ల్లిదండ్రులు రాగ‌సుధ‌ని కాపాడి త‌మ ఇంటిలో ఆశ్ర‌యం క‌ల్పిస్తారు. ఆ త‌రువాత త‌మ వ‌ద్దే వుండ‌మ‌ని తాము న‌డుపుతున్న టిఫిన్ సెంట‌ర్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. ఇదే క్ర‌మంలో రాగ‌సుధ .. ఆర్య వ‌ర్ధ‌న్ ని హ‌త్య చేసిన‌ట్టుగా ఊహించుకుంటుంది.

Also Read:ఆర్య‌వ‌ర్ధ‌న్ అస‌లు రంగు అనుకి తెలియ‌నుందా?

రాగ‌సుధ టిఫిన్ సెంట‌ర్ లో వుండ‌గా ఓ పోలీస్ వ్యాన్ వ‌చ్చి ఆగుతుంది. అందులోంచి దిగిన పోలీసుల టిఫిన్ చేస్తుంటారు.. ఇదే అదునుగా వ్యాన్ లో వున్న గ‌న్ ని తీసుకున్న రాగ‌సుధ వెంట‌నే ఆర్య‌వ‌ర్ధ‌న్ ఇంటికి వెళుతుంది. కానీ త‌నని సెక్యూరిటీ గార్డు లోనికి అనుమ‌తించ‌డు..లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకుంటాడు. ఇంటి బ‌య‌టే వుండి ఆర్య‌వ‌ర్ధ‌న్ కోసం వేచి చూస్తున్న రాగ‌సుధ పేప‌ర్ చ‌దువుకుంటూ ఆర్య వ‌స్తుండ‌టం గ‌మ‌నించి అత‌నిపై రెండు రౌండ్లు కాల్పులు జ‌రుపుతుంది.. క‌ట్ చేస్తే ఇది నిజం కాదు.. రాగ‌సుధ క‌ల కంటుంది... వెంట‌నే కంగారుప‌డుతున్న రాగ‌సుధ‌ని అను త‌ల్లిదండ్రులు ఏం జ‌రిగింద‌ని అడుగుతారు. ఏంలేద‌ని, త‌న‌కు వ‌చ్చింది క‌ల అని తేరుకుంటుంది.

అయితే ఆ త‌రువాత రాగ‌సుధ నిజంగానే ఆర్య‌వ‌ర్ధ‌న్ ని చంప‌డానికి బ‌య‌లుదేరుతుంది. ఆర్య వాళ్ల ఇంట్లో మాన్సీ `మ‌న ఆఫీసులో ఏదో జ‌రుగుతోంది. కానీ ఎవ‌రికీ తెలియ‌డం లేదు` అని ఆర్య‌తో అంటుంది. అయితే అది నీకు అన‌వ‌సరం అని అంటాడు ఆర్య‌. ఇంత‌లో రాగ‌సుధ .. ఆర్య ఇంట్లోకే ఎంట‌ర‌వుతుంది. గ‌దుల‌న్నీ వెత‌క‌డం మొద‌లుపెడుతుంది.. కానీ అదే స‌మ‌యానికి ఆర్య‌, అను క‌లిసి కార్ లో బ‌య‌టికి వెళ‌తారు. ఆ త‌రువాత కొంత సేప‌టికే అనుని కిడ్నాప్ చేస్తున్నాన‌ని షాకిస్తాడు ఆర్య‌.. అయితే ఆర్య నిజంగానే అనుని కిడ్నాప్ చేశాడా? అస‌లు ఆర్య ప్లాన్ ఏంటీ? ... జ‌రుగుతున్న విష‌యాల‌న్నీ అనుకు తెలియ‌కూడ‌ద‌ని ఆర్య త‌ల్లి ఎందుకు చెప్పింది? . ఆమె కూడా కుట్ర‌లో భాగ‌మైపోయిందా? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.