English | Telugu

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఆరోహి!

'దసరా' పండుగ ముందుగానే వచ్చినట్టుగా ఆదివారం గ్రాండ్ గా మొదలైంది బిగ్ బాస్. నాగార్జున దసరా బుల్లోడిలా రెడీ అయ్యి వచ్చాడు. కొంతమంది సింగర్స్ వచ్చి పాటలతో అలరించారు.

నాగార్జున, కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విభజించి వారితో 'బతుకమ్మ' ఆడించాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ "విజయదశమి పండుగకి సరిగ్గా పది మంది నామినేషన్లో ఉన్నారు" అని సరదాగా అన్నాడు. నాగార్జున ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుండగా,మధ్యలో గీతు మాట్లాడింది. దానికి నాగార్జున కోపగించుకున్నాడు. "నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకు కూర్చో ఫస్ట్" అని అన్నాడు. ఆ తర్వాత కీర్తి భట్, చంటికి మధ్య ఉన్న 'మిస్ కమ్యూనికేషన్' ని దూరం చేసాడు. "హౌస్ లో ఎవరైనా సరే చూసింది మాత్రమే నమ్మండి. ఎవరితోనైనా గొడవలు ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని వెంటనే సరిచేసుకోండి" అని కంటెస్టెంట్స్ తో చెప్పుకొచ్చాడు.

నామినేషన్స్ లో ఒక్కో గేమ్ లో ఒక్కొక్కరుగా సేవ్ అయ్యారు. చివరగా ఆరోహి ఎలిమినేట్ అయింది. "ఆరోహి ఇంట్లో వాళ్ళకి 'బై' చెప్పేసి వచ్చేయమ్మా" అని చెప్పాడు నాగార్జున.ఆరోహి ఎలిమినేట్ అయింది అనగానే కీర్తి భట్, సూర్య బాగా ఏడ్చేసారు. ఆ తర్వాత నాగార్జున దగ్గరకు వచ్చేసింది ఆరోహి. స్క్రీన్ మీద తన 'AV'చూపించగా,అది చూస్తూ ఏడ్చేసింది. ఆ తర్వాత "హౌస్ లో కల్మషం ఎవరు? స్వచ్ఛం ఎవరు?" అని నాగార్జున అడగగా.. "సూర్య, కీర్తి భట్, వాసంతి, మెరీనా-రోహిత్, శ్రీహాన్, ఆదిత్య స్వచ్ఛమైనవారు" అని చెప్పింది. "కీర్తి భట్ నన్ను అమ్మ లెక్కనే చూసుకునేది. నేను తిన్నానో లేదో అని, ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి మరి తినిపించేది. నాకు ఎప్పుడూ దగ్గరగా ఉండి చూసుకునేది" అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. "రేవంత్, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయ, గీతు కల్మషం కలవారు" అని చెప్పింది. "గీతు స్ట్రాంగ్. రేవంత్ చాలా సాఫ్ట్.. మాట తీరు కొంచెం మారాలి. శ్రీసత్య గాసిప్స్ క్వీన్. ఈ హౌస్ లో కీర్తి తర్వాత అర్థం చేసుకుంది ఇనయ" అంటూ ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది. "ఇనయాతో నా పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాను.. చాలా దగ్గర అయ్యాం" అని ఆరోహిఅనగానే "మిస్ యూ" అంటూ ఇనయ ఏడ్చేసింది. ఆ తర్వాత నాగార్జున టైం అయిందని ఆరోహిని బయటకు పంపించేసాడు. అలా ఎలిమినేషన్ లో నాలుగవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసింది ఆరోహి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.