English | Telugu

'అవన్నీ తుప్పాస్ రీజన్స్' అని అంటోన్న ఆదిరెడ్డి !

బిగ్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదలైన మాటల యుద్ధం హై వోల్టేజ్ డ్రామాని తలపించింది. హౌస్ లో నామినేషన్లతో హీటెడ్ వాతావరణం నెలకొంది.

అర్జున్ ని మొదటగా నామినేషన్ చేసాడు ఆదిరెడ్డి. "దీనికి కారణం, ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో నేను డాన్స్ చెయ్యలేదు అని అన్నావ్. నేను అయిన ఎలాగో అలా చేశాను కానీ నువ్వు ఏం చేసావ్? ఏం చెయ్యలేదు." అని చెప్పి నామినెటే చేసాడు. అందుకు సమాధానంగా , "But i dissagree with this " అని చెప్పాడు అర్జున్. అలాగే రెండవ నామినేషన్ గా వసంతి ని చేసి, "నువ్ నామినేషన్ అంటే బయపడతావ్" అని చెప్పాడు. "హౌస్ లో నామినేషన్ అంటే భయపడని వారు ఎవరు ఉన్నారు" అని సమాధానం చెప్పింది. కాగా "హౌస్ లో ఎలాంటి పర్ఫామెన్స్ లేదు. లెస్ డెజర్వింగ్ ఎవరంటే నువ్వే వసంతి" అని ఆదిరెడ్డి అనగా, "అలా ఏలా అంటారు మీరు. ఎలాంటి పర్ఫామెన్స్ లేదు అని ఎలా అంటవ్" అంటూ వసంతి ఎదురుదాడికి తిగింది‌. "హౌస్ లో నువ్ కెప్టెన్ గా జీరో అయ్యావ్" అని అనగా, "కెప్టెన్ అయి జీరో అయ్యాను అది నీకంటే బెటర్ ఏ" అంటు చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.


"నువ్ రెండు వారాలు సోఫా వెనకాల ఉన్నావ్. హౌస్ లో ఎలాంటి పెర్ఫార్మన్స్ లేకుండా ఉంటేనే సోఫా వెనుకాలా ఉన్నావ్. నీతో పోల్చితే నేను చాలా బెటర్ అని నా ఒపీనియన్." అని ఆదిరెడ్డి చెప్పాడు. అలాగే ఆదిరెడ్డిని నామినేట్ చేసాడు అర్జున్. కారణం ఏంటి అని అడుగగా, 'డీసెర్వింగ్' , 'లెస్ డెసెర్వింగ్ ' అని టూ వర్డ్స్ ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసాడు. ఎందుకు అంటే డిసర్వింగ్ అవునా? కాదా? అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. మీరు ఎలా అంటారు. " అని అర్జున్ అనగా, "నామినేట్ చేయడానికి కారణాలు లేకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకూడదు అర్జున్ బ్రో " అని చెప్పగా, "ఇది నాకు నచ్చలేదు. అందుకే నామినేట్ చేస్తున్నాను" అని అన్నాడు.ఆదిరెడ్డి మాత్రం, "ఇవి తుప్పాస్ రీజన్స్" అని కొట్టిపారేసాడు.

ఇకముందు హౌస్ లో ఆదిరెడ్డి ఆడబోయే ఆటలో ఎంత వరకు పెర్ఫార్మన్స్ చూపించి ప్రేక్షకుల ఓట్లు పొందుతాడో చూడాలి. నిన్న నామినేషన్ లో ఈ హీటెడ్ ఆర్గుమెంట్ అలా ముగిసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.