English | Telugu

పెళ్లి గురించి అడిగితే వర్షిణి దిమ్మతిరిగే ఆన్సర్

యాంక‌ర్ వ‌ర్షిణి బుల్లితెక‌ర‌పై పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ప‌టాస్ -2, కామెడీ స్టార్స్ షోల‌కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన వ‌ర్షిణి సౌంద‌ర రాజ‌న్ `చంద‌మామ క‌థ‌లు` చిత్రంతో న‌టిగా కెరీర్ ప్రారంభించింది. ల‌వ‌ర్స్‌, బెస్ట్ యాక్ట‌ర్స్‌, శ్రీ‌రామ ర‌క్ష‌, పెళ్లి గోల - సిరీస్‌ల‌లో న‌టించింది. `మ‌ళ్లీ మొద‌లైంది` చిత్రంతో మ‌రోసారి వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లుపెట్టింది. ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోయినా వ‌ర్షిణికి మాత్రం చారిత్ర‌క చిత్రం `శాకుంత‌లం`లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది.

స‌మంత లీడ్ పాత్ర‌లో న‌టించ‌గా గుణ‌శేఖ‌ర్ ఈ మూవీని రూపొందించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో వ‌ర్షిణికి మంచి పాత్రే ద‌క్కింద‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే బుల్లితెర‌పై వ‌ర్షిణికి అవ‌కాశాలు ద‌క్క‌డం లేదు. వెండితెర‌పై కూడా ఆమెది ఇవే ప‌రిస్థితి. అయితే అవ‌కాశాల కోసం వెత‌క‌డం లేదు. సోష‌ల్ మీడియానే వేదిక‌గా చేసుకుంటూ హాట్ హాట్ ఫొటోల‌తో ఫ్యాన్స్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

ఇటీవ‌ల బ్లాక్ డ్రెస్ లో వ‌ర్షిణి హొయ‌లు పోతూ పోజులిచ్చిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇదిలా వుంటే తాజాగా వర్షిణి పెట్టిన పోస్ట్ నెటిజ‌న్‌ల‌ని ఆక‌ట్టుకుంటోంది. `26 ఏళ్లు వ‌చ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా?' అని ఎవరైనా ప్ర‌శ్నిస్తే.. తాను ఇలా స‌మాధానం చెబుతానంటూ వ‌ర్షిణి ప‌రోక్షంగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 'మ‌నం 2022లోకి వ‌చ్చాం.. అయినా కూడా మ‌న ప‌ని మనం చేసుకోకుండా ప‌క్క‌వారి గురించే ఆలోచిస్తున్నారా?' అని ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా వ‌ర్షిణి పోస్ట్ పెట్ట‌డం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. అంటే పెళ్లి గురించి త‌న‌ని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడద‌ని వ‌ర్షిణి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చింద‌ని నెటిజ‌న్స్ కామెంట్ లు చేస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.