English | Telugu

మూగ జీవాలపై జాలి చూపించండి అంటున్న రష్మీ

జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఈమె అటు సినిమాలు, ఇటు టీవీ షోస్ , ఇంకో పక్క న్యూ షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతోంది. ఇవన్నీ ఒక ఎత్తు ఈమె మనసు ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఈమెకి మూగజీవాలంటే చాలా ప్రేమ, ప్రాణం కూడా. ఈమె ఒకవిధంగా పెట్ లవర్. మాటలు రాని మూగ జీవాల్ని ఎవరు హింసించినా, బలి ఇచ్చినా ఈమె అసలు ఊరుకోదు. వాటి కోసం ఫైట్ చేస్తుంది. ఎప్పుడు , ఎక్కడ , ఎలాంటి సంఘటన జరిగినా మూగ జీవాలకు సంబంధించింది వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా ఆమె ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. అందులో ఒక కుక్క ఒక డబ్బాలో మూతి పెట్టేసి దాన్ని లాకోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఐతే అంతలో అక్కడికి యానిమల్ రెస్క్యూ టీమ్ వచ్చింది.

ఆ కుక్కని కాపాడటానికి హెల్ప్ చేస్తూ ఉంది ఆ టీమ్. ఇది ఒక అపార్ట్మెంట్ దగ్గర జరిగేసరికి ఆ అపార్ట్మెంట్ లో నుంచి ఒకాయన వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయొద్దు వెళ్లిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు . ఈ సంఘటనపై రష్మీ చాలా బాధపడి అసహనం వ్యక్తం చేసింది. ఆ కుక్క మూతి డబ్బాలోంచి రాకపోతే ఏమి తినలేక ఆకలితో చచ్చిపోతుంది. కానీ ఈ అపార్ట్మెంట్ లోని ఒక అంకుల్ మాత్రం యానిమల్ రెస్క్యూ టీంని అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ అరుస్తున్నాడు. మూగ జీవి ఇబ్బందిలో ఉంటె ఆ అంకుల్ అలా అనడం కరెక్టేనా అంటూ ప్రశ్నించింది ? ఏ మూగ జీవికి ఆపద వచ్చినా వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చాక వాళ్ళను పని చేయనివ్వండి. ఇలాంటి అంకుల్ ప్రవర్తించినట్టు ఎవరూ చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించింది రష్మీ గౌతమ్. ఇక నెటిజన్స్ కూడా రష్మీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.