English | Telugu

250 మందిలో తానొక్కతే అమ్మాయినని చెప్పిన నేహా చౌదరి!

నేహా చౌదరి.. స్పోర్ట్స్ రిప్రెజంటర్ గా, యోగా ట్రైనర్ గా, యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. యాంకరింగ్ అంటే ఇష్టంతో బుల్లితెరపైకి అడుగుపెట్టిన నేహా.. పలు మూవీ ఆడియో ఫంక్షన్స్ కి హోస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రో కబడ్డీ, ఐసీఐసీఐ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీకి యాంకర్ గా కూడా చేసింది నేహా. సైమా అవార్డ్స్-2019 ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

యాంకర్ గా గుర్తుంపు తెచ్చుకున్నాక నేహాకి బిగ్ బాస్ లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళిన తర్వాత తన ఆటతీరుతో మాటతీరుతో మెప్పించి క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ తర్వాత తన ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజు పెళ్ళి కూతురు గెటప్ లో వచ్చి నేహా అందరిని ఆశ్చర్యపరిచింది. తన స్నేహితుడు.. చిన్నప్పటి నుండి తన ఇంటిపక్కనే ఉండే తన స్నేహితుడినే పెళ్ళి చేసుకుంటున్నట్టు చెప్పిన నేహా.. పెళ్ళి ముహూర్తం వరకు తను ఎవరనేది సీక్రెట్ గా ఉంచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో తర్వాత నేహాకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. దాంతో తను సినిమా షూటింగ్ లో‌ బిజీగా ఉంటుంది. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండే నేహా తాజాగా ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినట్లు చెప్పింది.

నేహా చౌదరి ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. అందులో తన సినిమా అప్డేట్ గురించి చెప్పింది నేహా. హైదరాబాద్ నుండి ఒక మూవీ షూటింగ్ కోసం పూణేకి వెళ్ళిన నేహా.. ఒక వారం నుండి అక్కడ షూటింగ్ లో పాల్గొంటోందట. హైదరాబాద్ నుండి 250 మంది కాస్ట్ అండ్ క్రూ వెళ్ళగా.. అందులో నేహా ఒక్కతే అమ్మాయంట. కానీ ఏ రోజు వాళ్ళు తనకి ఇన్ సెక్యూరిటీ, అన్ కంఫర్ట్ ఇవ్వలేదంట. బాగా చూసుకున్నారంట‌. తనకి ఒక హోమ్ లా అనిపించందంట. ఇలా తను నటిస్తున్న సినిమా గురించి చెప్తూ చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది నేహా చౌదరి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.