English | Telugu
అమరదీప్ అంతలా ఏడిపించాడు అందరినీ
Updated : Aug 29, 2022
అమరదీప్ - తేజస్విని సీరియల్ నటులే ఐనా ఒక రోజు సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ మొదలయ్యింది అనేది పెద్ద సస్పెన్స్. ఐతే అమరదీప్ తన కాబోయే భార్యతో, అత్తతో కన్నీళ్లు పెట్టించాడు. వాళ్లిద్దరూ స్టేజి మీదే ఏడ్చేశారు. వినాయక చవితి సందర్భంగా "మాతో పండగే పండగ" అనే ఈవెంట్ ఆగష్టు 31 న ప్రసారం కాబోతోంది. ఈ ప్రోమో చూస్తే గనక ఎవ్వరైనా కంట తడి పెట్టకుండా ఉండలేరు. ఈ ఈవెంట్ లో అమరదీప్, తేజు స్పెషల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. వీళ్ళ లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయ్యింది..అనే ఎన్నో విషయాలు ఈ ప్రోమోలో చూపించారు. "నేను నీ లైఫ్ లోకి రావడం ఏమో కానీ నువ్వు నా లైఫ్ లోకి రావడం అదృష్టమే అంటూ ఒకరికొకరు ఐ లవ్ యూ" చెప్పుకుంటారు. తర్వాత తేజుకి ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేసాడు అమరదీప్. తేజస్విని తండ్రి మైనపు విగ్రహాన్ని స్టేజి మీదకు తీసుకొస్తాడు. అలాగే కాబోయే అత్తగారి కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చి స్టేజి మీద కళ్ళ గంతలు విప్పుతారు. అంతే ఒక్కసారికి తేజు, వాళ్ళ అమ్మ షాక్ అవుతారు. అంతలోనే ఎమోషన్ ఐపోతారు. తేజు వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయారు.
అందుకే ఆయన్ని గుర్తుచేయడానికి ఆయన ఆశీర్వాదం తీసుకోడానికి ఇలా ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసాడు అమర్. ఇక తేజస్విని తల్లి అది చూసి " భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమను కూడా నా కూతురికి అందిస్తావని నాకు అర్ధమయ్యింది. లవ్ యూ " అంటుంది. అమర్‌దీప్ కూడా " లవ్యూ అమ్మ" అన్నాడు. ఆ తర్వాత స్టేజీ మీద ఈ జంటకు మరోసారి నిశ్చితార్థం చేశారు బుల్లితెర నటులు. ఈ ఈవెంట్ లో వీళ్ళ హంగామా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోతుంది.