English | Telugu
హార్ట్ టచింగ్ సీన్ గా ఆదిరెడ్డి మాట్లాడిన వీడియో కాల్!
Updated : Oct 12, 2022
మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఫ్యామిలిని ఇన్వాల్స్ చేస్తు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. 'బ్యాటరీస్ ఛార్జ్' పేరిట ఇచ్చిన ఈ టాస్క్ లో ఆదిరెడ్డిని కన్ఫేషన్ రూం కి పిలిచాడు బిగ్ బాస్.
కన్పేషన్ రూం కి వెళ్ళాక ఆదిరెడ్డికి మూడు ఆప్షన్ లు ఇచ్చాడు. మొదటి ఆప్షన్ ఆడియో కాల్, రెండవది వీడియో కాల్, మూడవది మెసెజ్. ఇలా మూడు ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఎంచుకోమన్నాడు. అందులో ఏది ఎంచుకున్నా హౌస్ బ్యాటరీ నుండి ఛార్జ్ పోతుంది అని చెప్పగా వీడియో కాల్ ఆప్షన్ ఎన్నుకున్నాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత కాసేపటికి వీడియో కాల్ కనెక్ట్ చేసాడు బిగ్ బాస్.
"హాయ్ కవిత.ఎలా ఉన్నావ్. పాప ఎలా ఉంది. అద్విత ఇటు చూడు" అన్న ఆదిరెడ్డి. అటువైపు నుండి కవిత మాట్లాడుతూ "మేం బాగున్నాం. అద్విత అమ్మ అంటోంది.నిన్ను చాలా మిస్ అవుతుంది." అని కవిత చెప్పింది. "నేను గేమ్ ఎలా ఆడుతున్నాను.ఇంకా ఏమైనా మార్చుకోవాలా" అని ఆదిరెడ్డి అడుగగా, కవిత మాట్లాడుతూ "బాగా ఆడుతున్నావ్. నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నావ్. అవతల ఎవరున్నా ఫైట్ చేయు. ఇంకా పాప, నేను చాలా మిస్ అవుతున్నాం. అయినా మిమ్మల్ని ఎందుకు మిస్ అవ్వాలి? దానికి సమాధానం నువ్వు విజేతగా నిలిచి కప్పు తీసుకురావడమే!" అని కవిత చెప్పింది. దీంతో ఆదిరెడ్డి "మంచి ఎనర్జీ ఇచ్చావ్ కవిత. లవ్ యూ కవిత. ఇక చూడు నా ఆట చూపిస్తా చూడు" అన్నాడు ఆదిరెడ్డి.
తన భార్య చెప్పిన ఇన్స్పిరేషనల్ మాటలు ప్రేక్షకులను కదిలించాయి. ఆ తర్వాత ఆదిరెడ్డి ఒక్కడే మాట్లాడుకున్నాడు. మంచి ఎనర్జీ ఇచ్చావ్ కవిత. థాంక్స్ బిగ్ బాస్ అంటూ మంచి ఎనర్జీగా కనిపించాడు. ఒక రివ్యూయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యడు. కెప్టెన్ విజేతగా నిలుస్తాడో?లేదో? చూడాలి మరి.