English | Telugu

" స రి గ మ ప " స్టేజి చాలా లక్కీ అన్న ఆది సాయికుమార్

తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో " స రి గ మ ప " ఇప్పుడు " స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ షో " గా అందరినీ అలరిస్తోంది. కోటి, ఎస్పీ శైలజ, స్మిత, అనంత శ్రీరామ్, గీత మాధురి, రేవంత్, శ్రీకృష్ణ, సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌండిన్య జడ్జెస్ గా, మెంటార్స్ గా ఈ షోలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ షో కొత్త ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బోనాలు జాతర స్పెషల్ ఎపిసోడ్ గా వచ్చే వారం మన ముందుకు రాబోతోంది. ఇక ఈ ప్రోమోలో బోనాలు ఎత్తుకుని శ్రీముఖి, శైలజ, స్మిత, గీతామాధురి, లేడీ కంటెస్టెంట్స్ అందరు స్టేజి మీదకు వస్తారు.

బోనాలు దింపి శ్రీముఖి బోనాలు జాతర శుభాకాంక్షలు అంటూ మంచి జోష్ తో అనౌన్స్ చేస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా బోనం ఎత్తి బయలెల్లు పాటకి సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌండిన్య ఇద్దరూ సూపర్ గా డాన్స్ చేసి అలరిస్తారు. వాళ్లకు తోడుగా కోటి కూడా డాన్స్ చేసి సందడి చేశారు. ఇక ఈ షోకి సాయికుమార్ తనయుడు ఆది వచ్చాడు. ఈ స్టేజి అంటే తనకు చాలా లక్కీ అని చెప్పాడు. ఎందుకంటే ఒకే ఒక లోకల్ సాంగ్ ఈ స్టేజి మీద పాడేసరికి అది ఫుల్ వైరల్ అయ్యింది అని చెప్పారు. "నిన్ను నిన్నుగా ప్రేమించిన" అనే పాటకు శ్రీముఖి, ఆది కలిసి జోడి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు.

ఆది ప్రేమ కావలి, లవ్లీ, సుకుమారుడు వంటి మూవీస్ తో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆది లిస్టులో అమరన్, కిరాతక, క్రేజీ ఫెలోస్, తీస్ మార్ ఖాన్, అతిథిదేవోభవ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాబోయే జులైలో మూడు చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది. చాలా కాలంగా ఆది లిస్టులో ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక ఇప్పుడు వరుసగా రాబోతున్న చిత్రాల్లో ఏ చిత్రంతో హిట్ కొడతాడో వేచి చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.