English | Telugu

ఆర్య వ‌ర్ధ‌న్ మైండ్ లో ఏముంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. థ్రిల్లింగ్ క‌థాంశంతో రూపొందిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఇది. ట్విస్ట్ లు, చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ ఆత్మ ప‌గా, ప్ర‌తీకారం నేప‌థ్యంలో సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త వారం నుంచి చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. అనుని అడ్డం పెట్టుకుని తెలివిగా ఆర్య వ‌ర్ధ‌న్ ని లాక్ చేస్తుంది రాగ‌సుధ‌. గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్ కి అడ్డంగా నిలిచి ఆర్య‌ని మూడు రోజుల పాటు క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని రిక్వెస్ట్ చేస్తుంది.

త‌ను అనుకున్న‌ట్టుగానే గ‌వ‌ర్న‌ర్ పోలీసుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ఆర్య వ‌ర్థ‌న్ ని పోలీసులు మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి తీసుకుంటారు. ఇది భ‌రించలేని అను రాగ‌సుధ వుంటున్న ఇంటికి వెళ్లి త‌న చెంప‌లు వాయించి హత్య చేసేంత ప‌ని చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ దృశ్యాల‌ని మీడియా క్యాప్చ‌ర్ చేసేలా చేస్తుంది. విష‌యం తెలిసి ఆర్య అక్క‌డి నుంచి అనుని వెళ్లిపొమ్మ‌ని చెబుతాడు. దీంతో ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో అను అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

మూడు రోజుల క‌స్ట‌డీకి అంగీక‌రించిన ఆర్య ఎలాంటి ప‌నులు చేయ‌కుండా, రాగ‌సుధ ఆట‌క‌ట్టించే ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కుండా సైలెంట్ అయిపోతాడు. ఇంత‌కీ ఆర్య మైండ్ లో ఏముంది? .. రాగ‌సుధ రెచ్చిపోతున్నా ఆర్య మౌనం వ‌హించ‌డానికి వెన‌కున్న మ‌త‌ల‌బేంటీ? ..ఏం ప్లాన్ చేయ‌బోతున్నాడు? ఇప్ప‌టికే ఆ ప్లాన్ ని మొద‌లు పెట్టాడా? .. ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్. అదేంటో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.