English | Telugu

తిలోత్త‌మ కుట్ర‌.. భ‌ర్త‌తో వ‌న‌వాసానికి త్రిన‌య‌ని

బుల్లితెర పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రినయ‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసిపోయే వ‌రం వున్న త్రిన‌య‌ని జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల స‌మాహ‌ర‌మే ఈ సీరియ‌ల్ క‌న్న‌డ నటులు చందు గౌడ‌, అషికా గోపాల్ ప‌దుకోన్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. దైవ శ‌క్తికి దుష్ట శ‌క్తికి మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రింతంగా సాగుతోంది. తిలోత్త‌మ కార‌ణంగా త‌ల్లిని పోగొట్టుకున్న విశాల్ ఆ విష‌యం తెలియ‌క‌పోవ‌డంతో తిలోత్త‌మ‌ని త‌ల్లిగా ఆరాధిస్తుంటాడు.

ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిరిగిందో చూద్దాం. ఆస్తిని న‌య‌ని నుంచి త‌న హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ప‌థకం ప‌న్నిన తిలోత్త‌మ.. క‌సితో క‌లిసి విశాల్‌ని, న‌య‌న‌ని తంత్రికుడి ద‌గ్గ‌రికి దీసుకెళ్లి విశాల్ త‌ల్లి ఆత్మ‌ని బంధించాల‌ని ప్లాన్ చేస్తుంది. అదే క్ర‌మంలో విశాల్ ని కూడా అంతం చేయాల‌ని కుట్ర ప‌న్నుతుంది. విష‌యం తెలిసిన న‌య‌ని నిత‌దీయ‌డంతో ఆస్తి ప‌త్రాల‌పై సంత‌కం చేస్తావా లేదంటే త‌ల్లి ఆత్మ‌ని బంధించి విశాల్ ని అంతం చేయ‌మంటావా తేల్చుకో అంటుంది. చేసేది లేక న‌య‌ని ఆస్తి ప‌త్రాల‌పై సంత‌కం చేస్తుంది.

ఇంటికి వ‌చ్చాక విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టి న‌య‌ని త‌న‌కు ఇంటి నుంచి వెళ్లిపోవాల‌ని వుంద‌ని ఆస్తిని అప్ప‌గించి చెప్పింద‌ని తిలోత్త‌మ‌, క‌సి నాట‌కం మొద‌లుపెడ‌తారు. ఇది కుట్ర అని హాసిని వాదించినా న‌య‌ని మాత్రం ఎక్క‌డ తాన భ‌ర్త విశాల్‌ ప్రాణాలు తీస్తుందోన‌ని ఎదురు చెప్ప‌దు. న‌య‌ని చేసిన ప‌ని వెన‌క ఏదో కార‌ణం వుంద‌ని న‌మ్మిన విశాల్ త‌న చేసిన ప‌నిని స‌మ‌ర్థిస్తాడు. క‌ట్ చేస్తే తిలోత్త‌మ , క‌సి ఇద్ద‌రు క‌లిసి న‌య‌న‌ని ఇంటి నుంచి వెళ్ల‌గొట్టాల‌ని మ‌ళ్లీ న‌య‌ని సంత‌కం పెట్టిన పేప‌ర్ ని అడ్డుపెట్టుకుని త‌న‌ని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. త‌న‌తో పాటు తాను కూడా బ‌య‌టికి వెళ్లిపోతాన‌ని విశాల్ నిర్ణ‌యించుకోవ‌డంతో ముందు షాక్ తిన్న తిలోత్త‌మ ఇది మ‌రీ మంచిద‌ని సంతోషిస్తుంది.

క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రాముడి వెంట సీత అడ‌వుల‌కు వెళ్లిన‌ట్టు తాను కూడా న‌య‌ని వెంట వెళ్లిపోతాన‌ని, త‌న త‌ల్లి ఫొటో తీసుకుని బ‌య‌టికి వెళ్లిపోతాడు విశాల్‌. న‌య‌నితో క‌లిసి త‌న తాత క‌ట్టించిన లేబ‌ర్ కాల‌నీలో వుండ‌టానికి వెళ‌తారు.. అక్క‌డికి వ‌చ్చిన క‌సి, వ‌ల్ల‌భ 5 వేలు అడ్వాన్స్ క‌డితేనే అక్క‌డ వుండ‌నిస్తామ‌ని కండీష‌న్ పెడ‌తారు. దీంతో అంతా తలా 5 వంద‌లు వేసి క‌డ‌తామ‌ని కాల‌నీ వాసులు ముందుకొస్తారు కానీ న‌య‌ని మాత్రం అందుకు అంగీక‌రించ‌దు. త‌న భ‌ర్త ప్రేమ‌గా ఇచ్చిన ప‌ట్టీలు తాక‌ట్టుపెట్టుకుని డ‌బ్బులు ఇమ్మంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌సి అందుకు అంగీక‌రించిందా? లేబ‌ర్ కాల‌నీలో న‌య‌ని, విశాల్ ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.