English | Telugu

`క్యాష్` షోలో ర‌చ్చ ర‌చ్చ చేసిన సాయి ప‌ల్ల‌వి

రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యాన‌ర్ పై చెరుకూరి సుధాక‌ర్ నిర్మించారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ గ‌త ఏడాది కాలంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు జూన్ 17న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ నేప‌థ్యంలో రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. టీవీ షోల‌లో పాల్గొంటూ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు.

సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న నేప‌థ్యంలో హీరోయిన్ సాయి ప‌ల్ల‌వితో పాటు చిత్ర బృందం కూడా సుమ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `క్యాష్‌` షోలో పాల్గొన్నారు. తాజాగా విడుద‌లైన ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. జూన్ 18న రాత్రి 9:30 గంట‌ల‌కు ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. ఈ షోలో సాయి ప‌ల్ల‌వి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చిరున‌వ్వులు చిందిస్తూ షో లోకి ఎంట్రీ ఇస్తూనే సుమ‌పై సాయి ప‌ల్ల‌వి పంచ్ వేసింది. 'మొన్న ఈవెంట్ లో.. ఇప్పుడు ఇక్క‌డ.. ఇది ఎలా సాధ్య‌మైంది?' అంటూ సుమ‌ని ప్ర‌శ్నించింది.

'ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ నావే' అంటూ ఫ‌న్నీగా సుమ ఆన్స‌ర్ ఇచ్చింది. సాయి ప‌ల్ల‌వితో పాటు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల, న‌వీన్ చంద్ర ఈ షోలో పాల్గొన్నారు. న‌వీన్ చంద్ర ఎంట్రీ ఇవ్వ‌గానే సుమ అత‌నికి పెట్రోల్ బాటిల్ ఇచ్చింది. ఇదిలా వుంటే షోలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటో డిస్ ప్లే కాగానే సాయి ప‌ల్ల‌వి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో తెలిపింది సాయి ప‌ల్ల‌వి. సూప‌ర్ స్టార్ అయిన‌ప్ప‌టికీ ఓ సాధార‌ణ వ్య‌క్తిలా వుంటార‌ని, త‌న హార్ట్ లో ఏమ‌నిపిస్తే అది మాట్లాడ‌తార‌ని, అందుకే ఆయ‌నంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.