English | Telugu

రాత్రి 12 నుంచి న్యూ జర్నీ.. రిషిని హగ్ చేసుకున్న వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో... రిషి, వసుధారలు కాలేజీలో తమ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. "నాకు పాత రోజులు కావాలి.. నీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, దాపరికాలు లేని ప్రేమ కావాలి" అని వసుధారతో రిషి అంటాడు. "మనం పాత రిషి సర్, వసుధారలు అయిపోదామా.. మన ప్రేమ, మన పరిచయం మళ్ళీ మొదలుపెడదాం. అప్పుడైనా మనం సంతోషంగా ఉంటామేమో" అని వసు అంటుంది. "బాగానే ఉంది కాని మన చుట్టూ మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు.. మనల్ని అంగీకరిస్తారా" అని రిషి అంటాడు. మనం మన జర్నీని మళ్ళీ మనకోసం మొదలు పెడదాం అనుకున్నాం.. వేరే వాళ్ళ కోసం కాదని వసుధార అంటుంది. మీరు నా పాత ఎండీలాగా మారాలి అని చెప్తుంది. మన జర్నీ ఈ రాత్రి 12 గంటల నుండి మొదలు పెట్టాలని రిషి, వసుధారలు ఒక ఒప్పందానికి వస్తారు.

మరోవైపు జగతి, మహేంద్రలు కలిసి.. రిషి మన కాలేజీ పరువు కాపాడాడు. నిజంగా రిషి గ్రేట్ అంటూ ఫణీంధ్ర, దేవయానిలకు కాలేజీలో జరిగిన విషయాలు మొత్తం చెప్తారు. అంతలోనే రిషి, వసుధార ఇద్దరు కలిసి వస్తారు. "రిషి నువ్వు ఆ పేపర్స్ గురించి చాలా కష్టపడ్డావంట కదా. నాకు తెలుసు నాన్న, నువ్వు కాలేజీ కోసం ఏమైనా చేస్తావని.. అందరూ నీ గురించి గొప్పగా పొగుడుతుంటే హ్యాపీగా ఉంది నాన్న" అని దేవాయని అంటుంది. ఈ గొప్పతనం నాది కాదు వసుధారది.. తను కూడా చాలా కష్టపడిందని రిషి చెప్తాడు. సర్ నేను చేసిందేమీ లేదు.. అంత మీరే చేశారని వసుధార అనగానే.. ఎవరు గొప్పతనం ఒప్పుకోరు కదా అని ఫణింధ్ర అంటాడు. రిషి అలా వసుధారని పొగడటం దేవయానికి నచ్చదు.. దాంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

రిషి తన‌ గదిలో, వసుధార తన గదిలో ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. 12 ఎప్పుడు అవుతుందా, న్యూ జర్నీ ఎప్పుడు మొదలు పెడదామా అన్నట్లుగా ఇద్దరు చూస్తారు. పన్నెండు అవడంతోనే ఇద్దరు ఒకేసారి హాల్లోకి వచ్చి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఏడు వరకు పాత రిషీ వసుధారలం.. మిగతా టైంలో మాములుగా ఉందామని రిషి అంటాడు. వసుధార సరే అంటుంది. బెస్టాఫ్ లక్ అని ఇద్దరు చెప్పుకొని, రిషి వెళ్ళిపోతుండగా.. వసుధార వెనకాల నుండి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. ఇదేంటని రిషి అడగగా.. ప్రేమ సర్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.