English | Telugu

రేడియోజాకీ పోస్ట్ కి రాజీనామా చేసిన కృష్ణతులసి

జీ తెలుగులో కృష్ణతులసి సీరియల్ ప్రతీ వారం టాప్ టు ప్లేసెస్ లో నిలుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గురవమ్మ అప్పు తీర్చడానికి ఆమె కూతురు రూపారాణికి శ్యామా ఘోస్ట్ సింగర్ గా పాటలు పాడుతూ ఉంటుంది. శ్యామా భర్త అఖిల్ వాళ్ళ తాతయ్యకు ఆక్సిడెంట్ జరుగుతుంది. అతను కోమా స్టేజిలోకి వెళ్లిపోయేసరికి మ్యూజిక్ థెరఫీ వల్ల అతన్ని బతికించుకోవచ్చని డాక్టర్ చెప్తారు. అలా శ్యామా పాటతో వల్ల తాతయ్య బతుకుతాడు. ఈ నేపథ్యంలో శ్యామా గురవమ్మ అప్పు తీర్చడానికి బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ లో పని చేస్తోందని వసంతకు తెలుస్తుంది. ఇంతలో ఐశ్వర్యకి గురవమ్మకు మధ్య తలెత్తిన మనస్పర్థలు కారణంగా తెలివిగా ఐశ్వర్య తన సెల్ లో రికార్డు చేసిన ఆధారాలను వసంతకు చూపించి ఆమెను , రూపారాణిని ఇంట్లోంచి వెళ్లగొడుతుంది.

బ్యూటీ కాంటెస్ట్ పోటీకి ఐశ్వర్యకు జడ్జిగా రమ్మంటూ ఆహ్వానం వస్తుంది. కానీ వెళ్లలేకపోతుంది. తాను వెళ్లలేనప్పుడు శ్యామా కూడా జాబ్ చేయడం కరెక్ట్ కాదు అని మనసులో కుళ్లిపోతుంది. వసంతతో చెప్పించి జాబ్ రిజైన్ చేసేలా ప్లాన్ చేసి ఆమెతో అదే విషయాన్ని చెప్పేస్తుంది. శ్యామా ఆ బాధను భరించలేక కన్నయ్య విగ్రహం దగ్గర తన బాధ చెప్పుకుంటుంది. అది విన్న అఖిల్ వెళ్లి వాళ్ళ అమ్మ వసంతకు నచ్చ జెప్తాడు. దాంతో వసంత కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అక్కడితో ఆ సమస్య తీరుతుంది. మరో పక్క బ్లూ ఎఫ్ ఎం స్టేషన్ హెడ్ అమెరికా వెళ్లాల్సి వస్తుంది. ఇక స్టేషన్ బాధ్యతలను చూసుకోవాలంటూ సౌజన్యకు చెప్తాడాయన. కృష్ణ తులసిని పిలిచి "మాట పాట విత్ కృష్ణ తులసి " ప్రోగ్రాం ఎలా సక్సెస్ అయ్యిందో అంతకు మించి మరో ప్రోగ్రాం ని డిజైన్ చేసే బాధ్యతను శ్యామాకి అప్పగిస్తాడు. ఇక ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలను ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణతులసి సీరియల్ లో చూడొచ్చు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.