English | Telugu

`స్టార్ మా`లో నేటి నుంచే `వంట‌ల‌క్క‌` షురూ

ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ జంట‌గా న‌టించిన పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని ఈ ఇద్ద‌రినీ టాప్ సెల‌బ్రిటీలుగా మార్చేసింది. మ‌రీ ముఖ్యంగా ఇందులో వంట‌ల‌క్క పాత్ర‌లో దీప‌గా న‌టించిన‌ ప్రేమి విశ్వ‌నాథ్ ని స్టార్ గా మార్చి పాపుల‌ర్ అయ్యేలా చేసింది. ఇందులో ప్రేమి విశ్వ‌నాథ్ పోషించిన వంట‌ల‌క్క‌ పాత్ర సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ని సైతం ఆక‌ట్టుకుని అభిమానులుగా మారేలా చేసింది. అలా పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క పేరుతో కొత్తగా స్టార్ మాలో ఓ సీరియ‌ల్ ప్రారంభం అవుతోంది.

ధీర‌వీయ‌మ్ రాజ‌కుమార‌న్‌, శిరీన్ శ్రీ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `వంట‌ల‌క్క‌`. ఇత‌ర పాత్ర‌ల్లో నీళ‌ల్ గళ్ ర‌వి, మౌనిక తదిత‌రులు న‌టించారు. ఈ సీరియ‌ల్ జూన్ 6 నుంచి మధ్యాహ్నం 2.30 ని.లకు ప్ర‌సారం కానుంది. బంగారు బొమ్మ‌లా చూసుకునే పెద్దింటి కుటుంబంలో పుట్టిన ఓ యువ‌తికి.. అత్యాశ‌కు పోయి ఎలాంటి భ‌యం లేకుండా ఊరు నిండా అప్పులు చేసే ఓ బాధ్య‌త‌లేని యువ‌కుడు ఆస్తి కోసం వ‌ల వేస్తాడు. చివ‌రికి పెళ్లి చేసుకుంటాడు. త‌న భ‌ర్త కోసం పుట్టింటి వారి నుంచి చిల్లి గ‌వ్వ కూడా త‌న‌కు వ‌ద్ద‌ని భ‌ర్త‌తో క‌లిసి ఆ యువ‌తి ఇంటిని, త‌న కుటుంబాన్ని కాద‌ని బ‌య‌టికి వ‌చ్చేస్తుంది.

వ‌స్తుంద‌నుకున్న ఆస్తి రాక‌పోగా భార్య చీప్ గా వంట‌లు చేస్తూ సంసారాన్ని సాగిస్తుండ‌టంతో త‌న‌ని చీద‌రించుకుంటూ హింసిస్తుంటాడు. ఈ క్ర‌మంలో వంట‌ల‌క్క జీవితం ఎలాంటి మ‌లువులు తిరిగింది? .. ఆత్మ‌గౌర‌వం వున్న యువ‌తి త‌న పుట్టింటి వారిని స‌హాయం అడిగిందా? లేక త‌న భ‌ర్త‌ని మార్చుకుని విధి ఆడిన వింత నాట‌కంలో విజ‌యం సాధించిందా? అన్న‌దే ఈ సీరియ‌ల్ ప్ర‌ధాన క‌థ. జూన్ 6 సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న‌ఈ సీరియ‌ల్ సోమ వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తీ రోజు మధ్యాహ్నం 2.30 ని.లకు ప్ర‌సారం కాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.