English | Telugu

బాలయ్య 'అన్ స్టాపబుల్'.. 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలన రికార్డ్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ గా ఒక టాక్ షో చేస్తున్నారని న్యూస్ రాగానే అందరూ షాక్ అయ్యారు. ఆ టాక్ షో ఎవరు చూస్తారు అంటూ కొందరు పెదవి విరిచారు కూడా. కానీ బాలకృష్ణ 'నేను దిగనంత వరకే.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్' అంటూ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఆయన ఎనర్జీకి, కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఈ షో రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది.

మొత్తం 10 ఎపిసోడ్స్ తో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ అలరించింది. మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు గెస్ట్ గా రాగా, ముగింపు ఎపిసోడ్ లో మహేష్ బాబు సందడి చేశాడు. ప్రతి ఎపిసోడ్ లోనూ గెస్ట్ లతో బాలయ్య సరదాగా మాట్లాడే విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మనస్సుకి ఏదనిపిస్తే అది చెప్తూ, చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తూ.. నిజ జీవితంలో బాలకృష్ణ ఇలా ఉంటాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ షో ఎవరు చూస్తారు అనుకున్నవాళ్ళని కూడా షో చూసేలా చేశాడు. అందుకే గెస్ట్ తో సంబంధం లేకుండా అన్ స్టాపబుల్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అన్ స్టాపబుల్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ మొదటి సీజన్ కు ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. దీంతో ఆహాలో మోస్ట్ వాచ్‌డ్ షోగా నిలిచింది. అంతేకాదు ఓటీటీలో తెలుగులో ఈ స్థాయిలో మరే షోకి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. మరి అన్ స్టాపబుల్ రెండో సీజన్ తో బాలయ్య ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.