English | Telugu

ఫేక్ డాక్యుమెంట్స్ తో లోన్ తీసుకున్న తులసి

తులసిని తెలివిగా మోసం చేసాను అనుకుంటూ లోలోపల ఫుల్ ఖుషీగా ఉంటుంది లాస్య. లాస్య ఆనందాన్ని చూసి ఏమిటని అడుగుతాడు. తులసి రోడ్డున పడిన విషయం చెప్తుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యింది కానీ వాటిని ఎవరో కాజేశారని చెప్తుంది. నందు కూడా చాలా సంతోషంగా వెళ్లి తులసిని పలకరించి వద్దామా అని మళ్ళీ వద్దులే అని మనసు మార్చుకుంటాడు. తులసిని కాపాడడానికి అంకిత పక్కనే వుంది కదా వద్దులే అంటుంది లాస్య. ఇంకోవైపు తులసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎవరినైనా లాయర్ ని కలిస్తే బాగుంటుంది అంటుంది. ఎందుకు అల్లుడే ఉన్నాడుగా చెపుదాం అంటుంది అనసూయ. వద్దు అందరికీ ఈ విషయం తెలిస్తే బాగోదు అంటుంది తులసి. తులసి ఇంట్లో ఉన్న శృతికి ప్రేమ్ నుంచి ఫోన్ వచ్చేసరికి ఇంటికి బయల్దేరుతుంది. ఆ బ్రోకర్ గాడు నాకు కనిపిస్తే వాడిని చితక్కోటేస్తాను అంటుంది అనసూయ. ఐనా మోసం చేసి ఏం బాగుపడతాడులే అంటుంది.

ఇంతలో అక్కడికి వచ్చిన నందు అవును ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది అంటూ తులసి వైపు కోపంగా చూస్తాడు. ఫ్యాక్టరీ తీసుకున్నావ్ వదిలేసావ్, నాన్న ఆపరేషన్ కోసం అప్పు చేసావ్ వదిలేసావ్. చివరికి ఇల్లు కూడా నీవల్లే పోయింది ఐనా నీకు అహంకారం తగ్గలేదు అంటాడు. ఇప్పుడు ఈ బ్యాంకు లోన్ విషయం ఇలా జరిగింది ఐనా నీకు బుద్ది రాదు అంటాడు. నా లోన్ నా ఇష్టం అని గట్టిగా నందుకు వార్నింగ్ ఇస్తుంది తులసి. మరో వైపు ప్రేమ్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక శృతి అవస్థలు పడుతూ ఉంటుంది. ఇక లాస్య ఊరుకోకుండా బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి తులసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్న విషయం చెప్తుంది .. ఇక సీరియల్ లోని మిగతా హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.