English | Telugu

మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్, సుహాసిని, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వచ్చారు. ఇక ఈ ప్రోమో మొత్తం జోక్స్ తో నిండిపోయింది. రాగానే అందరికీ కొబ్బరి మామిడి ముక్కలు ఇచ్చింది సుమ. ఆ తర్వాత ఇందులో సుహాసినిని హైలైట్ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకోమని అడిగింది సుమా. "నాకు మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు..ఇది తగిలించి పులుసు వేసుకుని తింటే ఉంటాది నా సామి" అంది. దాంతో సుమ అంది చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడూ అని అంది. అదేంటో అర్ధం కాక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది సుహాసిని. "చేపలు పొట్టలోపలికి వెళ్లి గలుగులు చేస్తాయి" అంది. దాంతో నవ్వేసింది సుహాసిని. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది "చంటిగాడు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నా కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవకపోవడానికి కారణం ఏంటి" అని అడిగింది. "సక్సెస్ వచ్చింది. అది హ్యాపీ థింగ్.

మరీ కాకపొతే ఆ ఏజ్ లో కాకుండా కొంచెం 20 స్ లో వచ్చి ఉండి ఉంటే బాగుండేది అని ఫీలింగ్ ఉంది" అంది సుహాసిని. "అయ్యో మీరు ఇప్పుడే 20 స్ లో ఉన్నట్టుగా ఉన్నారు" అని సుమా రివర్స్ కౌంటర్ వేసేసరికి సుహాసిని అది నిజమే అనుకోండి అనబోతున్నంతలో "సరదాగా జోక్ చేసాను లెండి" అంటూ సుహాసిని పరువు మొత్తం తీసేసింది". తర్వాత సుమ ప్రియాంక చేత కాఫీ, టీ ఎలా అమ్మాలో చేసి చూపించాలంటూ" టాస్క్ ఇచ్చింది. లాస్ట్ లో సుహాసినికి కూరగాయలు అమ్మే టాస్క్ ఇచ్చింది. ఐతే సుహాసిని ముందు స్టైల్ గా కూరగాయలు అమ్మింది కానీ ఆ తర్వాత మాస్ మసాలా రేంజ్ లో కూరలు అమ్మేసరికి ఇది అసలు రూపం అంటూ అంబటి అర్జున్ సుహాసిని గురించి కామెంట్ చేసాడు. సుహాసిని చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ లాంటి మూవీస్ లో నటించింది. ఇంకొన్ని మూవీస్ లో సహాయక పాత్రల్లో నటించింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.