English | Telugu
వర్ష, ఇమ్ము పెళ్ళికి వచ్చిన స్టార్ హీరోస్!
Updated : Oct 3, 2022
ఎక్స్ట్రా జబర్దస్త్ కొంత కాలం నుంచి మంచి స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ జోడి చేసే సందడి హైలైట్ గా నిలుస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే వర్ష, ఇమ్ము ప్రేమ ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. కొంత కాలం ఇద్దరి మధ్యన మాటలు లేవు. మళ్ళీ ఈ స్టేజెస్ మీద సారీ చెప్పుకోవడం, కలిసిపోవడం కామన్ ఐపోయింది వీళ్లిద్దరికీ. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేయడానికి రెడీ ఇపోయారు.
స్టేజ్‌పై వీళ్ళ కెమిస్ట్రీ వేరే లెవెల్. ఇక తమ పెళ్లి జరగాలంటే ఒక పని చేయాలని ఒక సూపర్ కండిషన్ పెట్టింది వర్ష. "ఇమ్మూ మన పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి " అంటుంది.. వెంటనే ఇమ్మాన్యుయెల్ "అంతేనా నాకు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ అందరూ తెలుసు" అంటూ బిల్డప్ ఇచ్చేసరికి ఐతే వాళ్లందరినీ తీసుకోచ్చేయ్ ..పెళ్లి చేసుకుందాం" అని చెప్పింది వర్ష. వెంటనే చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ డూప్స్ వీళ్ళ పెళ్ళికి వచ్చేసారు. వాళ్లంతా డాన్సులు వేసి హంగామా చేశారు. ముందు మనం ఒక సంగీత్ ఫంక్షన్ పెట్టుకుందాం అని ఇమ్ముని అడిగింది వర్ష.
తర్వాత "కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు" సాంగ్ కి డూప్ హీరోస్ తో కలిసి వర్ష స్టెప్పులేస్తుంది. ఇది చూసిన ఇమ్ము చిరు, నాగ్, పవన్ డూప్స్ కి సారీ చెబుతూ, "ఆమె ఇంతకు ముందు అదే చేసేది అందుకే ఆ పాట పెట్టించి అవే స్టెప్పులు వేయించింది, ఏమనుకోకండి" అనేసరికి అందరూ నవ్వేశారు కానీ వర్ష ముఖం మాత్రం మాడిపోయింది. ఇక ఈ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను, గౌతమ్‌రాజు, రాకేష్ టీమ్ పెర్ఫార్మ్ చేసిన స్కిట్లు సైతం నవ్వులు పూయించాయి. దీనికి ఖుష్బు చాలా ఖుషి ఐపోయి "ఇదే అసలు సిసలైన కామెడీ షో" అంటూ కితాబిచ్చింది.