English | Telugu
శ్రీహాన్ తో రొమాన్స్..బాధలో అర్జున్..ఖుషీగా శ్రీసత్య !
Updated : Oct 6, 2022
బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం అని చెప్పొచ్చు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి శ్రీసత్య వెంట పడుతూ ఉన్నాడు. కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా అవసరమైనప్పుడే మాట్లాడుతూ ఉంటుంది.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా తనని ఎంటర్టైన్ చేయాలని కోరడంతో ‘ఓ సీతా..’ అనే పాటకు శ్రీ సత్య-శ్రీహాన్ రొమాంటిక్ డాన్స్ చేశారు. శ్రీహాన్ కూడా తక్కువేం తినలేదు శ్రీసత్యని ఎత్తుకుని మరీ డాన్స్ చేసేసాడు ఆమె కూడా అతని వైపు చాలా ఆరాధనగా చూడడం చూస్తే ఇద్దరి మధ్య ఏమన్నా లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందా అనిపించక మానదు.
ఇక పాపం వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి మన అర్జున్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ ఫేస్ ఫీలింగ్స్ గమనిస్తే మాత్రం మనోడు తెగ ఫీల్ అయిపోనట్టుగా కనిపించింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో చూపిస్తా అంటూ లాస్ట్ వీక్ చెప్పి ఎలాగో సేవ్ అయ్యాడు. కానీ ఈవారం శ్రీసత్య కోసం త్యాగం చేసి నామినేట్ అయ్యాడు. ఆమె కోసం ఏదైనా చేసేలా కనిపిస్తున్నాడు. కానీ ఆమె మాత్రం తనను పట్టించుకోకుండా శ్రీహాన్ తో డాన్స్ వేయడం చూస్తూ కక్కలేక మింగలేక రోజులు గడుపుతున్నాడు అర్జున్.