English | Telugu

‘ఊ అంటావా మావ’ అంటూ శేఖర్‌తో చిందేసిన శ్రీముఖి!


గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకరింగ్ మాత్ర‌మే కాదు,డాన్స్ కూడా ఇరగదీసేస్తుంది. ఎప్పుడూ యాక్టీవ్ గా, స్టేజిపై సందడి చేస్తూ ఉంటుంది శ్రీముఖి.. బుల్లితెర మీద శ్రీముఖి ఎన్నో షోస్ చేస్తూ అలరిస్తూ ఉంది. ఇప్పుడు "డాన్స్ ఐకాన్" లోకి టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో అతి పెద్ద డిజిటల్ ప్లాట్ ఫామ్ ఐన ఆహాలో ఈ డాన్స్ షో స్టార్ట్ కాబోతోంది. దీన్ని పాపులర్ యాంక‌ర్‌ ఓంకార్ నిర్వహిస్తున్నారు.

సెప్టెంబర్ 11న 'డాన్స్ ఐకాన్' ప్రారంభం కానుంది. ఈ షో కోసం శ్రీముఖి స్పెషల్ పెర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతః అనొచ్చు. గ్లామరస్ పింక్ డ్రెస్ లో ‘ఊ అంటావా మావ’ పాటకు డ్యాన్సర్స్ తో కలిసి స్టెప్పులు ఇరగదీసేసింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి వేసినహాట్ స్టెప్స్ తో ఒక ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

శ్రీముఖి డ్యాన్స్ పై నిర్మాత అల్లు అరవింద్, శేఖర్ మాస్టర్ ప్రశంసలు కురిపించారు."ఈ పాటకు ఒక అమ్మాయి చేస్తేనే మాములుగా ఉండదు, అలాంటిది నలుగురు అమ్మాయిలూ చేసేసరికి అదిరిపోయింది" అని శేఖర్ మాస్టర్ అంటే "మిగతా ప్రొఫెష‌న‌ల్‌ డాన్సర్స్ తో సమానంగా చేసావ్ష‌ అంటూ శ్రీముఖిని పొగిడేశారు అల్లు అరవింద్.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.