English | Telugu

చచ్చినా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళను.. అదొక డ్యామేజ్ షో!

ప్రముఖ పాప్‌ సింగర్‌ స్మిత అంటే తెలియని వారుండరు. ఆమె సింగర్, యాక్టర్, ఆంత్ర‌పెన్యూర్, డాన్సర్, సోషల్ యాక్టివిస్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఆల్‌రౌండర్. ఐతే చాలా ఏళ్ళు స్మిత్ తెర మీద కనిపించలేదు. ఇటీవల 'జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్'కి జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్న టైంలో స్మిత ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

"నాగార్జున ఫ్యామిలీతో మీ ఫామిలీకి అసోసియేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్‌లోకి రమ్మంటూ కాల్ వచ్చిందా?" అన్న ప్రశ్నకు "నేను చచ్చినా ఆ తప్పు చేయను.. ఎవరైనా చేస్తున్నా కూడా హౌస్‌లోకి వెళ్లి వచ్చాక ఏమొచ్చింది? అని అడుగుతాను. ఇలా అంటున్నందుకు సారీ చెప్తున్నా. ఎందుకంటే టెలివిజన్ రంగంలో ఇదొక డామేజ్ షో అని నా అభిప్రాయం. అంటోంది స్మిత‌.

"హౌస్ లోకి వెళ్ళాక మనలో వున్న టాలెంట్, మనలో అప్పటివరకు ఉన్న మంచి భావాలన్నీ కూడా పోతాయి. మనుషుల్ని ఒక హౌస్ లో పడేసి 'మీరు తన్నుకోండ్రా.. మేము టీఆర్పీలు తెచ్చుకుంటాం' అన్నట్టు ఉంటుంది ఆ షో. ఆ షో ఏమిటో నాకెప్పటికీ అర్థంకాదు. నేను అసలు ఆ షోనే చూడను.. నాకైతే అన్ని రోజులు అందరినీ వదిలేసి హౌస్ లోకి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేను. ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఈ షోలోకి వెళ్తున్నారు.. నేను ఏమన్నా అంటే వాళ్ళను అన్నట్టు ఉంటుంది." అని చెప్పింది స్మిత.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.