English | Telugu

Jayam Serial : జ్యోతి గురించి గంగ, రుద్ర నిజం తెలుసుకుంటారా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-179 లో.. రుద్ర, గంగ, వంశీ, సూర్య , పెద్దసారు అందరు సూపర్ మార్కెట్ ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఎంప్లాయిస్ అందరికి బోనస్ పంచాలని పెద్దసారు అంటాడు. ఇకనుండి అయినా తింగరిపనులు చేయకు అని గంగని రుద్ర తిట్టడంతో తను అలిగి వెళ్ళిపోతుంది. దాంతో గంగని బ్రతిమిలాడి తీసుకురా అని రుద్రని పంపిస్తాడు పెద్దసారు.

ఇక గంగ దగ్గరికి రుద్ర వచ్చి తనని పొగుడుతాడు. అది నిజమని అనుకొని గంగ మురిసిపోతుంది. ఇక గంగని అలానే మాటల్లో పెడతాడు రుద్ర. నీ వల్లే కదా ఇదంతా.. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలని రుద్ర చెప్తాడు. ఎంప్లాయిస్ కి బోనస్ ఇవ్వమన్నాడు కదా ఆ డబ్బులు ఏవి అని రుద్ర అడుగగా.. అయ్యో అవి అక్కడ పెట్టానని అంటుంది. మరి తొందరగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చెయ్ అని గంగతో రుద్ర చెప్తాడు. ఇక తను వెళ్ళి అందరికి బోనస్ ఇస్తుంది. అయితే అలా ఎంప్లాయిస్ కి బోనస్ ఇస్తున్నప్పుడు జ్యోతి లేదనే విషయాన్ని గంగ తెలుసుకుంటుంది. ఏం అయింది.. జ్యోతి ఎందుకు రాలేదని ఒక ఎంప్లాయిని గంగ అడుగుతుంది. తను రెండు రోజుల నుండి రావడం లేదు.. వాళ్ళ అమ్మ వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటే పరువు పోతుందని ఆలోచిస్తున్నట్టున్నారని ఆమె చెప్తుంది. దాంతో గంగ ఆలోచనల్లో పడుతుంది. వెంటనే అదే విషయం రుద్రకి చెప్తుంది. ఇలా అన్నింట్లో ఇరుక్కొని నెత్తిమీదేసుకుంటావని రుద్ర అంటాడు.

జ్యోతి మంచి ఎంప్లాయి సర్.. బాగా వర్క్ చేస్తుంది సర్.. వాళ్ళింటికి వెళదాం సర్ అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. రుద్ర ఆలోచిస్తుంటాడు. అదేంటి సర్.. మన ఎంప్లాయి పట్ల మన బాధ్యతగా ఉండకపోతే ఎలా అని గంగ అంటుంది. రుద్ర ఏం మాట్లాడకపోయేసరికి నేను వెళతానని వెళ్తుంటుంది. అప్పుడే రుద్ర తనని ఆపి తనతో పాటు జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వారి తల్లిదండ్రులని అడుగగా.. ప్రతీసారీ మాకు ఇది అలవాటే అని వాళ్లు అంటారు. కానీ జ్యోతి వాళ్ళ సిస్టర్ అపూర్వ భయంభయంగా ఉంటుంది. అది రుద్ర గమనించి తన దగ్గరకు వెళ్ళి.. జ్యోతి గురించి నీకు నిజం తెలుసు ఏంటా నిజం.. జ్యోతి ఎక్కడా అని అడుగుతాడు. ఇక తను జరిగిందంతా చెప్తుంది. జ్యోతి, ప్రవీణ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. అది మా అమ్మనాన్నలకి ఇష్టం లేదని అపూర్వ అంటుంది. రుద్ర వాళ్ళని అడుగగా.. కూతురిని కన్న ప్రతీ తల్లిదండ్రులు తను బాగుండాలనే కోరుకుంటారు కదా సర్.. ప్రవీణ్ మంచివాడు కాదు.. తను తర్వాత బాధపడుతుందని వాళ్ళు చెప్తారు. జ్యోతి ఆలోచించకుండా ఏ పని చేయదని గంగ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మరి రుద్ర, గంగ కలిసి జ్యోతి, ప్రవీణ్ కి కనిపెడతారా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.