English | Telugu

Illu illalu pillalu : అమూల్యని పెళ్ళిచేసుకొని వచ్చిన విశ్వ.. షాక్ లో రామరాజు ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -382 లో.. అమూల్య కన్పించడం లేదని విశ్వ వాళ్ళ పని ఇదంతా అని ముగ్గురు అన్నాతమ్ముళ్లు భద్రవతి ఇంటిపైకి గొడవకి వెళ్తారు. మీ చెల్లి లేచిపోతే ఇక్కడికి వచ్చి అడుగుతారేంట్రా అని భద్రవతి తప్పుగా మాట్లాడుతుంటే ధీరజ్ కి పట్టరాని కోపం వస్తుంది. అప్పుడే భద్రవతి వాళ్ళ పెద్దమ్మ వచ్చి.. అసలు ఏం జరుగుతుందని అడుగుతుంది. అమూల్య కన్పించడం లేదు.. వీళ్లే ఏదో చేశారని ధీరజ్ అంటాడు.

విశ్వ ఇంట్లో లేడు.. మీరు ముందు వెళ్లి అమూల్యని వెతకండి అని పెద్దావిడ అంటుంది. నా చెల్లికి ఏదైనా అవ్వాలి.. ఒక్కొక్కడి సంగతి చెప్తానని ధీరజ్ అందరికి వార్నింగ్ ఇస్తాడు. అమూల్య లేదని నర్మద వాళ్ళు టెన్షన్ పడుతారు. రాత్రి కరెంటు తీసేసారు. అప్పుడే ఇదంతా జరిగి ఉంటుందని ప్రేమ అంటుంది. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదని నర్మద అడుగుతుంది. ధీరజ్ కీ చెప్పాను కానీ వాడు పట్టించుకోలేదని ప్రేమ అంటుంది. మరొకవైపు అమూల్య దగ్గరికి విశ్వ మల్లెపూలు తీసుకొని వెళ్లి.. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ అని చెప్పగానే అమూల్య షాక్ అవుతుంది. ఇప్పుడు అందరు నువ్వు లేచిపోయావ్ అనుకుంటారు. మీ నాన్న పరువుపోతుందని విశ్వ అంటాడు. అమూల్య ఏడుస్తుంది. ఆ తర్వాత రామరాజు, భద్రవతి పెళ్లి బట్టలు తీసుకొని వస్తారు. అమూల్య లేదని తెలియగానే వేదవతి కుప్పకూలుతుంది. ఇలా చేస్తుంది అనుకోలేదని వేదవతి ఏడుస్తుంది. అప్పుడే వనజ ఫ్యామిలీ వస్తుంది.

అమ్మాయి రెడీ అయిందా అని అడుగుతుంది. అమ్మ మీరు లోపలికి రండి అని రామరాజు అంటాడు. లోపలికి పిలిచి నా కూతురు లేచిపోయిందని చెప్తారా.. మీ ఫ్యామిలీకి లేచిపోవడం వెన్నతో పెట్టిన విద్య రా అని పైనుండి చూస్తూ భద్రవతి అంటుంది. తరువాయి భాగంలో అమూల్యని తీసుకొని విశ్వ ఎంట్రీ ఇస్తాడు. అమూల్య రాత్రంతా నాతోనే ఉందని విశ్వ అంటాడు. విశ్వని కొట్టబోతుంటే.. ఆగండి మేమ్ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అమూల్య అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.