English | Telugu

Podharillu serial : కూతురు చనిపోయిందని చెప్పిన మహా వాళ్ళ నాన్న.. తను ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-38 లో.. కేశవ, మాధవ, కన్నా మాట్లాడుకుంటారు. నాన్న చక్రి, మహాల రిసెప్షన్ చేయమని చెప్పాడంటే నాకే నమ్మేలా లేదని కేశవ అంటాడు. నాన్న చెప్పింది కరెక్ట్ అని మాధవ అంటాడు. మనల్ని తిట్టేవాళ్ళకి భోజనాలు అవసరమా అని కేశవ అంటాడు. ఇక అప్పుడే కేశవ, మధవ, చక్రి, కన్నాల నాన్న నారాయణ వస్తాడు. వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందని అందరు నమ్మాలంటే చేయాలి. లేదంటే మీ అత్త నానా కూతలు కూస్తుంది. ఆ తర్వాత నేను నాలుగు పెగ్గులు వేసి వాళ్ళ గేట్ బద్దలు కొట్టి రావాల్సి వస్తుందని నారాయణ చెప్తాడు. అవును నిజమే ..‌రిసెప్షన్ చేయాలని మాధవ అంటాడు.

ఇక అందరు కలిసి మహా, చక్రిల రిసెప్షన్ కోసం ఏమేమీ కావాలో అన్నింటి గురించి నోట్స్ లో రాసుకుంటారు. మరోవైపు వాళ్ళ నాన్నని చూడటం కోసం మహా ఎదురుచూస్తుంటుంది. ఇక అప్పుడే మహా వాళ్ళ అన్న ఆది వస్తాడు. ఇక మహాను చూసి ఇష్టమొచ్చినట్టు తిట్టి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఇక బయటకి వచ్చిన మహా.. ఇంటి నుండి నన్ను గెంటేయొచ్చు కానీ నాన్నని కలవకుండా నువ్వు నన్ను ఆపలేవని మహా అంటుంది.

ఇక ఆది ఎంతమాట్లాడినా మహా వినదు.. ఇక ఆది ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు. నాన్న నీ కూతురు నీతో మాట్లాడాలంట అని ఆది ఫోన్ లో అనగానే నాకు ఎవరు లేరు.. నా కూతురు చచ్చిపోయిందని మహా వాళ్ళ నాన్న అంటాడు. దాంతో మహా నిరాశగా ఆది వాళ్ళ ఇంటి నుండి బయటకొస్తుంది. ఆ తర్వాత తనకేం చేయాలో తెలియదు. ఇక మహాకి చక్రి అండగా నిల్చుంటాడు. చక్రి ఫోన్ తీసుకొని తమ వదిన హారికకి కాల్ చేస్తుంది మహా. ఇప్పట్లో నాన్నని నువ్వు కలవకపోవడమే బెటర్.. నేను కాల్ చేస్తాను.. ఈ ఊర్లోనే ఉండకు అని హారిక చెప్తుంది. దాంతో తనకేం చేయాలో తెలియదు. మీరు మాతో రండి.. మా ఇంట్లో ఉండండి.. మీ లక్ష్యం నెరవేరాక మళ్ళీ ఇక్కడికి రండి అని చక్రి పాజిటివ్ గా మాట్లాడటంతో మహాతో పాటు చక్రి కార్ లో బయల్దేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.