English | Telugu

Podharillu : మహా, చక్రిల రిసెప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన మాధవ అండ్ బ్రదర్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -39 లో.... మహాని తీసుకొని చక్రి బయల్దేరతాడు. ప్రతాప్ లేచి ట్యాబ్లెట్ వేసుకుంటున్నది వీడియో తీసి మహాకి పంపిస్తుంది హారిక. అది చూసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హమ్మయ్య నాన్న కోలుకుంటున్నాడు అని మహా అనుకుంటుంది. మరొకవైపు మహా, చక్రిల రిసెప్షన్ చేసి వాళ్ళకి సర్ ప్రైజ్ ఇవ్వవాలని మాధవ వాళ్ళు అనుకుంటారు. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రిసెప్షన్ కి తాయారు వాళ్ళని పిలవడానికి మాధవ, కన్నా, కేశవ వెళ్తారు. అక్కడ వాళ్ళని అవమానించి పంపిస్తారు. ఆ తర్వాత రిసెప్షన్ కి అన్ని ఏర్పాట్లు జరిగినట్లే కానీ ముందు వాళ్ళకి బట్టలు కొనుకొని తీసుకొని రండి అని కేశవ, కన్నాని మాధవ షాపింగ్ కి పంపిస్తాడు.

ఆ తర్వాత చక్రి కార్ లో పెట్రోల్ కొట్టిస్తాడు కానీ తన దగ్గర డబ్బు ఉండదు. దాంతో మాధవకి ఫోన్ చేసి డబ్బు పంపించమని అడుగుతాడు. దాంతో మాధవ డబ్బు పంపిస్తాడు. నాకు ఆకలిగా ఉందని మహా అనగానే అయ్యో నేనే అడుగుదామనుకున్న పదండి అని చక్రి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత కేశవ, కన్నా ఇద్దరు షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చిన బట్టలు మాధవ చూసి చాలా బాగున్నాయని అంటాడు. అప్పుడే గాయత్రి వస్తుంది. చీర చూస్తుంది. దీనికి బ్లౌజ్ కుట్టించాలి అని.. నేను కుట్టించి తీసుకొని వస్తానని అంటుంది.

మరొకవైపు మహాని హోటల్ కి తీసుకొని వెళ్తాడు చక్రి. మహా తనకు చాలా ఆకలిగా ఉందంటూ చాలా వెరైటీస్ ఆర్డర్ చేస్తుంది. తరువాయి భాగంలో చక్రి, మహా ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ లీగల్ గా మ్యారేజ్ అయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. అది చూసి ఇదంతా నీకు ముందే తెలుసు కదా అని చక్రిపై మహా కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.