English | Telugu

సుడిగాలి సుధీర్ స‌ర‌సం మ‌రీ ఎక్కువైంద‌న్న ర‌ష్మీ

బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ గౌత‌మ్ ల‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స్టేజ్ పై ఇద్ద‌రు క‌లిశారంటే ఆ కెమిస్ట్రీ చూడ‌ముచ్చ‌ట‌గా వుంటుందంటారంతా. ఈ ఇద్ద‌రు జ‌బ‌ర్ద‌స్త్ షోతో మ‌రింత‌గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. వీరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని చూడ‌ని వారులేరు. చివ‌రికి ప్రొడ్యూస‌ర్స్ కూడా వీరిద్ద‌రితో సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి చివ‌రికి విఫ‌ల‌మ‌య్యారు. ర‌ష్మి అంగీక‌రించ‌కపోవ‌డంతో సినిమా కార్య‌రూపం దాల్చ‌లేదు.

వీరిద్ద‌రు బుల్లితెర‌పై ఏ షో చేసినా అది సూప‌ర్ హిట్టే.. అంత‌లా ఈ జోడీ పాపులారిటీని సొంతం చేసుకుంది. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రు క‌లిసి షోలు చేయ‌డం లేదు. తాజాగా ఈ ఇద్ద‌రు స్టార్ మా ఛాన‌ల్ ఏర్పాటు చేసిన స్పెష‌ల్ షోలో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ నెల 20న ప్ర‌త్యేకంగా ఓ స్పెష‌ల్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది స్టార్ మా. ఈ షోలో సుడిగాలి సుధీర్ , ర‌ష్మీ గౌత‌మ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. చాలా కాలం త‌రువాత జంట‌గా క‌నిపించ‌డంతో అక్క‌డున్న వారంతా ఈ జోడీ క‌నిపించ‌గానే ఆరుపులు కేక‌ల‌తో ర‌చ్చ చేశారు.

ఇదే అద‌నుగా అనుకున్న సుడిగాలి సుధీర్ .. మ‌రో సారి ర‌ష్మీ గౌత‌మ్ ని ఇంప్రెస్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ర‌ష్మీని ఐస్ చేస్తూ పాట‌లు అందుకున్నాడు. చురాలియా.. అంటూ ఓ పాటేసుకున్నాడు. మ‌ధ్య‌లో దూరిన యాంక‌ర్ ర‌వి సుధీర్ - ర‌ష్మీల మ‌ధ్య వున్న బంధాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్రం చేశాడు. ఛాన్స్ ఇస్తే ర‌ష్మీ.. సుధీర్ కు ఏం ఇవ్వాల‌నుకుంటుంది? అని ర‌ష్మిని ర‌వి అడిగేశాడు. సుధీర్ ని చూస్తూ `ఇచ్చేయ‌మంటావా? అంది ర‌ష్మీ.. కెమెరా ముందు ఇచ్చేదేనా..? అని సుధీర్ కొంటెగా చెప్ప‌డంతో. ర‌ష్మీ .. సుధీర్ ని ఒక్క‌టేసి నీకు స‌ర‌సాలు ఎక్కువ‌య్యాయి అంటూ కౌంట‌రిచ్చింది. ఆ వెంట‌నే యాంక‌ర్ ర‌వి మ‌ధ్య‌లో దూరి .. ర‌ష్మీ ఫోన్ లో సుధీర్ నంబ‌ర్ ఏ పేరుతో వుంట‌ది? అని అడిగేశాడు. దీనికి స‌మాధానం దాట‌వేసిన ర‌ష్మీ న‌వ్వుల్లో మునిగిపోయింది. ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.